జ‌న‌సేన మంత్రుల‌ను తొక్కేస్తోందెవ‌రు... అస‌లేం జ‌రుగుతోంది..?

RAMAKRISHNA S.S.
తెలుగు సోషల్ మీడియా పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తోంది. జనసేన మంత్రులకు తెలుగుదేశం అనుకూల మీడియాలో అనుకున్న స్థాయిలో కవరేజ్ ఉండటం లేదన్నదే పాయింట్. జనసేన నుంచి మొత్తం ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల‌ దుర్గేష్.. ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిపి 21 మంది ఉన్నారు. వీరిలో మంత్రులు ముగ్గురు మాత్రమే. అయితే నాదెండ్ల మనోహర్, కందుల‌ దుర్గేష్ పేర్లు తెలుగుదేశం అనుకూల దినపత్రికలలో చూసి చాలా రోజులు అవుతుంది. పవన్ పేరు మాత్రం రెండు మూడు సందర్భాలలో కనిపించింది.

ఒకసారి ఆగస్టు 15 వార్తలలో.. రెండోసారి గ్రామ కమిటీల సమావేశాలకు సంబంధించిన వార్తలలో మాత్రమే నాదెండ్ల మనోహర్ పేరు ప్రారంభంలో బాగా హైలెట్ చేశారు. ఆయన పర్యటనలకు వెళుతూ ఉండడంతో హైలైట్ అయ్యారు. ఆయన తొలినాళ్లల్లో చేసిన హడావుడి ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో..? ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన గురించి కవరేజ్ రావటం కూడా చాలా వరకు తగ్గింది. ఇక కందులు దుర్గేష్ సంగతి చెప్పక్కర్లేదు. నిడదవోలు ఎమ్మెల్యేగా లోకల్ గా కూడా ఆయనకు వస్తున్న క‌వ‌రేజ్ అంతంత మాత్రమే అంటున్నారు. ఇక అనకాపల్లి విషయానికొస్తే బిజెపి ఎంపీ సీఎం రమేష్ పేరు పత్రికలలో కనిపించనంతగా.. జనసేన ఎమ్మెల్యే కొణ‌తల రామకృష్ణ పేరు కనపడటం లేదంటున్నారు.

వాస్తవంగా చూస్తే ఎంపీ పేరు కన్నా.. ఎమ్మెల్యే పేరు ఎక్కువగా వినిపించడం.. కనిపించడం అన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ అక్కడ పూర్తి రివర్స్‌లో జరుగుతుంది. స్పీకర్‌ను నియమించిన వెంటనే డిప్యూటీ స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్ పోస్ట్ అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ప్రతిపక్షానికి ఇవ్వటం ఓ సంప్రదాయం. ఇప్పుడు ప్రతిపక్షం ఎలాగో లేదు. మరి డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఎందుకు రాలేదు..? అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కాల్వ శ్రీనివాసులకి ఇస్తున్నారని వార్తలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా అటు సీఎం చంద్రబాబు లోకేష్ పేర్లు నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. లోకేష్ చంద్రబాబుకు ఎలివేషన్లు కవరేజ్ ఇవ్వడంలో.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చాలా దూకుడుగా ఉంటుంది. అయితే అదే పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులు.. జనసేన ఎమ్మెల్యేల విషయంలో కనపడటం లేదన్న చర్చే నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: