ఏపీ వాలంటీర్లకు ఇప్పటికైనా జ్ఞానోదయమైందా.. ఆ తప్పులు చేస్తే కథ కంచికే?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు దాదాపుగా 70 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తుకు ఢోకా లేదని చాలామంది ఫీలయ్యారు. అయితే రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకునే అవకాశం లేదని టీడీపీ మంత్రి నుంచి క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీతో వాలంటీర్లకు ఇప్పటికైనా జ్ఞానోదయమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
 
వాలంటీర్లు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ రాజీనామా చేయని వాలంటీర్లు ఇష్టానుసారం తప్పులు చేసినా ఏదైనా రాజకీయ పార్టీకి కొమ్ము కాసేందుకు ప్రయత్నించినా ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకాల దిశగా టీడీపీ అడుగులు వేస్తుందేమో చూడాలి.
 
మరోవైపు గ్రామ, వార్డ్ వాలంటీర్లకు పెంచిన వేతనాలు ఎప్పటినుంచి అమలవుతాయనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల భవిష్యత్తు ఏ విధంగా ఉండనుందనే ప్రశ్నలకు సైతం మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది. వాలంటీర్లు సైతం తమ భవిష్యత్తు విషయంలో, జాబ్ సెక్యూరిటీ విషయంలో ఒకింత కంగారు పడుతుండటం గమనార్హం.
 
కూటమి సర్కార్ వాలంటీర్ల సేవలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుందనే చర్చ జరుగుతోంది. కూటమి నేతలు జగన్ ను వీలైనంత వరకు టార్గెట్ చేయకుండా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటూనే మెరుగైన పాలనను అందించే దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. ఇప్పటివరకు చంద్రబాబు పాలనకు మంచి మార్కులే పడ్డాయి. పవన్ కళ్యాణ్ సైతం ఏపీ రాజకీయాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా కూటమి నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: