వెరీ బ్యాడ్: ఓటమి ఎరుగని గంటాకి మంత్రిగా నో ఛాన్స్?

Purushottham Vinay
 
•పార్టీ ఏదైనా పవర్ మాత్రం గంటాదే

•తన రాజకీయ జీవితంలో అపజయం ఎరుగని నేత

•స్ట్రాంగ్ లీడర్ గంటాని మంత్రిగా చేయకుండా తప్పు చేసిన బాబు

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఎంత గొప్ప రాజకీయ నాయకుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అపార అనుభవం ఉన్న సీనియర్ నేతకి ఈ 2024 టీడీపీ మంత్రి వర్గంలో  అన్యాయం జరిగింది. అసలు గంట హిస్టరీ చూసుకుంటే 1999లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంట తన సమీప ప్రత్యర్థి బాలిరెడ్డి సత్యారావు (కాంగ్రెస్)పై దాదాపు 10వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.2009లో తన అభిమాన హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ చేరారు. అప్పుడు ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి కొణతాల రామకృష్ణపై 10866 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ లో చేరారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రిగా పని చేశారు.

రాష్ఠ్ర విభజన తరువాత 2014లో తిరిగి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అయిన భీమిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి.. శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పుడు చంద్రబాబు మంత్రిమండలిలో మానవ వనరుల అభివృద్ధిశాఖ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌, సెకండరీ ఎడ్యుకేషన్‌, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖల మంత్రిగా పని చేశారు. 2109లో మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా ఆయన ఏ పార్టీలో చేరిన సునాయాసంగా గెలిచేవాడు. అంత సత్తా ఉన్న నేత.ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గంట రాజీనామాను 2024 జనవరి 23న స్పీకర్ ఆమోదించారు. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో గంటా కి గట్టి పట్టు ఉంది . తన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా , ఒకసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు భీమిలీ నుంచి పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు. ఇలా అపజయం లేకుండా ఎన్నో విజయాలు సాధించిన గంటాకి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు అన్యాయం చేశారని గంట అనుచరులు బాధ పడుతున్నారు. గంట కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అయితే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం సీనియర్ నేత గంటాను టీడీపీ పక్కన పెట్టేసింది. అయినా కానీ గంటా లాంటి స్ట్రాంగ్ లీడర్ కి మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేది అని టీడీపీ తమ్ముళ్లు గంట అనుచరులు బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: