చంద్ర బాబు: ఆటో డ్రైవర్ల నెత్తిన గుదిబండ..!

Divya
కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ సీఎం గా విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీలను సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవల డీఎస్సీ పోస్టులు 16 వేలకు పైగా విడుదల చేయగా ,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పింఛన్ 4000 పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ మీద, అన్న క్యాంటీన్ వంటి వాటి పైన కూడా సంతకాలు చేశారు చంద్రబాబు. అయితే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు వంటి హామీ పథకంలో కూడా ఇంకా వీటిని అమలు చేయలేదు. ఒకవేళ ఇవి అమలు చేస్తే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల ఉపాధి మీద గుదిబండగా మారుతుందని తెలియజేస్తున్నారు.

పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆటోడ్రైవర్లు ఉపాధి మాత్రం అంతంత గానే కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటే ఇక ఆటోలు ఎక్కే వారు కూడా ఎవరూ ఉండరని చెప్పవచ్చు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ వంటి ప్రాంతాలలో చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే బస్సు డ్రైవర్ల కండక్టర్ల పరిస్థితి కూడా మరింత దారుణమైన స్థితిలో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ఆటోలలో వెళ్లారని కేవలం బస్సులలోనే వెళ్తారని చెప్పవచ్చు.

మరి ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయం పైన అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఇలాంటి పథకాలు అమలు చేయడం వల్ల ఆటో నేతలు తగలబెట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి గిరాకీలు లేక మరో ఉపాధి మార్గం వెతుక్కోవలసి వస్తోంది. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే సమస్యగా మారబోతోందని సమాచారం. ముఖ్యంగా జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఏడాదికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా కూడా అందించారు. ముఖ్యంగా టిడిపి ప్రకటించిన మహిళలకు ఉచిత ప్రయాణం వరమే అయినప్పటికీ ఆటోడ్రైవర్లకు అది శాపంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: