చంద్ర బాబు: యనమలకు క్యాబినెట్లో నో ఛాన్స్.. రీజన్ ఇదేనా..?

Divya
చంద్రబాబు నాయుడు ఈసారి క్యాబినెట్లో చాలా మంది సీనియర్లకు సైతం ఎలాంటి పదవులు ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరిని ఈసారి పరిగణంలోకి అసలు తీసుకోకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ తాజాగా యనమల రామకృష్ణుడు గురించి మొదలుపెడితే అమర్నాథ్ రెడ్డి వరకు ఎవరికీ తన మంత్రివర్గంలో అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం టిడిపిలో ఉండే యువ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా యనమల రామకృష్ణుడు లేని చంద్రబాబు క్యాబినెట్ ఇదే మొదటిసారి అని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా యనమల రామకృష్ణుడు మంత్రిగా ఉండేవారు. శాసనసభ వ్యవహారాలతో పాటు ఆర్థిక శాఖ వంటివి యనమల రామకృష్ణుడు కు అప్పగించేవారు చంద్రబాబుకు చాలా వరకు ఇది రిలీఫ్ గా ఉండేదట. ఇప్పుడు శాసనమండలిలో యనమల సభ్యుడిగా ఉన్నారు. కానీ క్యాబినెట్ లోకి మాత్రం అసలు తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు స్థానంలో పార్థసారధిని ఆ సామాజిక వర్గం నుంచి అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఎప్పుడు పాత మొహాల వల్ల ప్రజలు కూడా విసిగిపోయారని అందుకే మంత్రివర్గంలో కూడా కొంత కొత్త వారికి చోటు కల్పించేందుకు ఆయన ఇలాంటి ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యనమల కుటుంబంలో కుమార్తెతో పాటు వియ్యంకుడికి అల్లుడికి కూడా టికెట్లు ఇచ్చి ప్రాధాన్యత కల్పించారు. కానీ మంత్రివర్గంలో మాత్రం యనమలకు స్థానం ఇవ్వలేదు. అయితే అందుకు గల కారణాలు ఏంటి అనే విషయం బయట కనిపించకపోయిన లోలోపల మరికొన్ని ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి జూనియర్లు సీనియర్లను సైతం ఏవిధంగా మెప్పిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: