పింఛన్లపై పిచ్ రిపోర్ట్ బాబుకి అనుకూలమా? బాల్ స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్
 రాష్ట్రంలో కూటమి ఏకంగా 164 ఎమ్మెల్యే స్థానాల్లో, 21 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడంలో రాష్ట్రంలో పింఛన్లు తీసుకునే వాళ్ల పాత్ర కీలమని చెప్పవచ్చు. 2019 ఎన్నికలకు ముందు 1000 రూపాయల పింఛన్ ను 2000 రూపాయలకు పెంచిన చంద్రబాబు 2024 ఎన్నికల హామీల్లో భాగంగా 3000 రూపాయల పింఛన్ ను ఏకంగా 4000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
 
జులై 1వ తేదీన ఏపీలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఏకంగా 4000 రూపాయల పింఛన్ తో పాటు గత మూడు నెలల పెరిగిన పింఛన్ నెలకు 1000 చొప్పున 3000 రూపాయలు అదనంగా పొందనున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ మరింత ఎక్కువగా అందిస్తున్నారు. అయితే పింఛన్ల విషయంలో పిచ్ రిపోర్ట్ చంద్రబాబుకే అనుకూలమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
50 ఏళ్ల వయస్సు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సైతం జులై 1 నుంచి పింఛన్ అందుకోనున్నారు. పింఛన్ల విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే మాత్రం ఆయనకు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు పింఛన్ల అమలు విషయంలో మాట తప్పినా, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసినా బాల్ స్వింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
 
ఏపీ పింఛన్ల విషయంలో బాబు తీసుకున్న నిర్ణయాలు కూటమి విజయానికి ఎంతో దోహదపడ్డాయి. లబ్ధిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో, గెలుచుకోవడంలో చంద్రబాబు నాయుడు ఎంతమేర సక్సెస్ అవుతారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మరోవైపు బాబుకు పవన్ అండగా నిలబడుతున్న నేపథ్యంలో బాబు, పవన్ పాలన సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చంద్రబాబు సైతం మారిన మనిషిని అని చెబుతూ అద్భుతమైన పాలనను కచ్చితంగా అందిస్తానని అభివృద్ధి, సంక్షేమం విషయంలో తన మార్క్ చూపిస్తానని వెల్లడిస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఏపీ ప్రజలు కూటమికే మళ్లీమళ్లీ ఛాన్స్ ఇస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: