ఏపీలో 26 మంది మంత్రులే ఎందుకు.. ఎక్కువ మందిని ఎందుకు ఎన్నుకోకూడదంటే?

praveen
టిడిపి శ్రేణులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి వేళయింది. మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి పార్టీలతో కూడిన కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఏకంగా 175 స్థానాలకు గాను 164 చోట్ల ఘనవిజయాన్ని అందుకుంది.దీంతో ప్రతిపక్షమే లేని విజయాన్ని అందుకున్న టిడిపి ఇక నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కాగా చంద్రబాబు నాయుడు  నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

 అదే సమయంలో ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరికి మంత్రులుగా అవకాశం దక్కబోతుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ విషయంపై ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదకి వస్తున్నాయి. అయితే చంద్రబాబు కాకుండా మరో 25 మందిని క్యాబినెట్ లో మంత్రులుగా నియమించబోతున్నారు. అయితే ఎందుకు ఇలా కేవలం ఇలా సీఎం కాకుండా 25 మందిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేస్తారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. అయితే రాజ్యాంగం లోని చట్టం ప్రకారమే ఇలా ఏ రాష్ట్రంలోనైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నది తెలుస్తుంది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 165 లో చేసిన సవరణ చట్టం 2003 ప్రకారం ఒక రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు అయితే ఉన్నాయో.. ఆ నియోజకవర్గాల సంఖ్యలో 15% మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలు ఉండగా అందులో 15% అంటే కేవలం 26మంది మాత్రమే మంత్రులుగా పని చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక 12 మందికి తగ్గకుండా మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా.. ఇక సీఎం కాకుండా మరో 25 మందికి మంత్రి పదవి దక్కనుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: