పురందేశ్వరి: అదృష్టం ఎవరి వైపు..?

Divya

ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమిలో భాగంగా 164 స్థానాలలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు సీట్లను సంపాదించుకున్నాయి. దీంతో ఇటీవలే కొంతమంది నేతలకు పోస్ట్లను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ పక్ష నేతను ఎవరిని ఎంచుకుంటారు.. ఒకటి రెండు మంత్రి పదవులు కూడా వస్తాయని.. అలాగె ఒక మంత్రి ఒక సహాయక మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు క్యాబినెట్లో.. మరో అవకాశం వచ్చేసరికి శాసనసభ నేత  డిప్యూటీ శాసనసభ నేత. అలాగే ఒక విప్ కూడా ఉంటుంది..

8 మందిలో కనీసం ఐదు మంది కైనా అవకాశాలు వస్తాయట. కాబట్టి పురందేశ్వరి వీళ్ళందరి పేర్లను ఎంపిక చేసి మరి అధినాయకత్వానికి పంపించాల్సి ఉంటుందట. ఈ విషయంపైన పురందేశ్వరి పార్టీ నాయకులు అందరితో కూర్చొని మరి నిర్ణయం తీసుకుంటారా.. లేదా ఆమెగా ఒక ప్రతిపాదన పంపిస్తారా అనే విషయం పైన చూడాల్సి ఉన్నది.. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే.. ఇప్పటికే జనసేన శాసనసభ సభ్యులను ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశారు చేయడం కూడా జరిగింది. చంద్రబాబు గారు కూడా సీఎం మరొకవైపు వాళ్లకి సంబంధించిన శాసనసభ సభ్యులలో కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ఇక్కడ బిజెపి పార్టీ జాతీయ జనతా పార్టీ కాబట్టి అందుకే ఇప్పుడు పరీక్ష గా మారుతోంది.

బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా నిలబడిన అన్ని చోట్ల కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చాలా మంది నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా రాయలసీమలోని ధర్మవరం నియోజవర్గంలో వైసీపీ నేత కేతిరెడ్డి ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవే కాకుండా చాలా చోట్ల కూడా బిజెపి పార్టీ వేల మెజారిటీతో గెలవడం జరిగింది. ఏది ఏమైనా బిజెపి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: