ఏపీ: జగన్ కు మరో కొత్త దెబ్బ..!

Divya
2019లో వైసిపి పార్టీ 151 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఎన్నికలలో భాగంగా తిరిగి మళ్లీ అధికారం చేపడుతుందని వైసీపీ నేతలు భావించినప్పటికీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. దీంతో అటు నేతలపైన వైసీపీ పార్టీ అధినేత పైన కూడా చాలా ట్రోల్స్ వినిపించడమే కాకుండా కచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిధుల తిరుగుబాటు కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అనేకమంది కూడా ఇతర పార్టీలలోకి వెళుతూ ఉంటారు. గతంలో కూడా అదే జరిగింది.

ముఖ్యంగా శాసనసభ సభ్యులు కూడా అలాగే వెళ్లిపోయారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది నేతలు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్లారు.. అలాంటిదే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు వెళతారేమో చూడాలి.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా శాసనసభ్యులు చేరలేదు.. చాలా తక్కువలోనే వెళ్లారు. ముఖ్యంగా తమ నాయకులు మీద చాలా గట్టి నమ్మకం ఉండేది.. అప్పట్లో వైసీపీ వాళ్లు 23 మంది దాకా వెళ్లారు. ఇప్పుడు చూస్తే ఒకపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు మేయర్ రాజీనామా చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ చైర్మన్గా వ్యవహరించిన.. వాళ్ల రాజీనామాలను ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి చైర్మన్ బి గౌతమ్ రెడ్డి.. ఏపీ ఇన్ ఇంగ్లాండ్ దిలీప్ కుమార్, అలాగే మరొక నేతకాయల వెంకటరెడ్డి రాజీనామాను ఆమోదించి ప్రభుత్వం గెజిట్ ను జారీ చేసింది.. మరొకవైపు చూస్తే విశాఖపట్నం కి సంబంధించి వంశీకృష్ణ కూడా మారిపోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వరుసగా చూస్తే వివిధ కార్పొరేషన్ల మున్సిపాలిటీలను హస్త గతం చేసుకునేందుకు కూటమి సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి నేతలపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి. 2029 ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: