విజయమ్మ: జగన్ ఇంటి వైపు పైన పయనం..!

Divya
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ ఫ్యామిలీ ఉమ్మడిగా ఉండి విజయమ్మ వెంట ఉండేది.. ముఖ్యంగా విజయమ్మ కూడా తమ బిడ్డలతో ఎక్కువగా కలిసి ఉండేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక  అటు కొడుకు జైలుకు వెళ్లడం.. కూతురు పాదయాత్ర చేయడం వంటివి జరిగాయి.. అయితే వీటన్నిటినీ కూడా దగ్గరుండి మరి చూసుకుంది విజయమ్మ.. ఆ తర్వాత వచ్చేసరికి వైయస్సార్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నది.. ఆ తర్వాత విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది.

అప్పటినుంచి వైసిపి పార్టీ నుంచి ఇనాక్టివ్ గా మారిపోయారు. తర్వాత పూర్తిగా పార్టీ అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. తర్వాత 2019లో ఆమెను పోటీ చేయనివ్వకుండా ఉన్నారు.. ప్రచారం కూడా ఏమి చేయనివ్వలేదు. కంప్లీట్ గా జగన్ తన పాదయాత్రతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వారి విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత కొద్ది రోజులకి షర్మిల మళ్లీ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో కలిపేసింది. అయితే ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయం పైన వివాదమంతా నడిచింది.

ఇప్పుడు షర్మిల తమ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నది. విజయమ్మ కూడా అక్కడే ఉన్నది. అమెరికా నుంచి షర్మిల కి ఓటు వేయండి అంటూ కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడు తాజాగా వెనక్కి వచ్చి మరి.. ఓటమిపాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు ఆయనతో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య చాలా వైరల్ గా మారడంతో ఈ విషయం ఎన్నికలలో కూడా చాలా దెబ్బతీసిందని చెప్పవచ్చు. అలాగే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం కూడా వైసిపి పార్టీకి కాస్త దెబ్బ పడేలా కనిపించింది. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే చాలా నియోజకవర్గాలలో ఓట్లను చీల్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: