ఏపీ: మొన్న పవన్, చంద్రబాబు.. నేడు జగన్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని 2024 ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున విడుదలయ్యాయి. ఇందులో ప్రజా తీర్పు కింద కూటమి 163 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. వైసిపి పార్టీ చాలా ఘోరమైన ఓటమిని చవిచూసింది. అయితే ఈ ఓటమి తర్వాత కనిపించకుండా పారిపోతారని వైసీపీ నేతలను టిడిపి నేతలు చాలా ఎద్దేవ చేశారు.. ముఖ్యంగా వైసిపి అధినేత జగన్ పైన ఇలాంటి రూమర్స్ ఎన్నో సృష్టించారు. ఓటమి తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ ఎలా అయితే జనం ముందుకు వచ్చి.. మాట్లాడి నెక్స్ట్ సాధిస్తామని చెప్పుకొచ్చారో.. చంద్రబాబు నాయుడు ఆనాడు ఎలా అయితే ఓడిపోయాను తెలియలేదు అంటూ తెలియజేశారో బాగోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఎలక్షన్లకు ప్రిపేర్ అయ్యారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నిన్నటి రోజున మీడియా ముందు మాట్లాడుతూ.. కోట్లాది మందికి చేయూత ఇచ్చాము.. అలాగే అవ్వ తాతలకు కూడా పెన్షన్ ఇచ్చాము.. ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకోవచ్చాము.. ఇన్ని చేసినా కూడా ఇన్ని కోట్ల మందికి లబ్ధి పొందినా సరే ఓటు ఎందుకు వేయలేదు అర్థం కావట్లేదు అంటూ తెలియజేశారు.. ఈ సన్నివేశాలు చెబుతున్నప్పుడు కాస్త బాగా ద్వేగం కనిపించింది.

ఆ మాటలు చాలామంది వైసిపి నేతలను కంటతడి పెట్టించేలా చేసింది.. ఓవరాల్ గా చేయాల్సింది అంతా చేసి.. ఓటమి పాలు అయ్యాను.. అయితే దీని వెనక కారణం ఎవరిని విషయం చెప్పను నేను.. కానీ ఏం జరిగిందన్నది అర్థం కావడం లేదంటూ తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.. అంతేకాకుండా తాము ప్రతిపక్షంలో ఉండడం కొత్తేమి కాదని గతంలో కూడా ఒకసారి ఉన్నాము ఇప్పుడు మళ్లీ ఉంటున్నాము కచ్చితంగా అంతకంటే రెట్టింపు వేగంతో వస్తామంటూ తెలియజేశారు. మొత్తానికైతే ఈ ఎన్నికలలో కూటమిదే విజయం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: