అమ‌లాపురం ఎంపీ: అద్గ‌ది మ‌న బాల‌యోగి కొడుకు హ‌రీష్ అద‌ర‌గొట్టి ఎంపీ అయ్యిండు..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు చాలా బలంగా ఉన్న పార్లమెంటు స్థానాలలో అమలాపురం పార్లమెంటు స్థానం ఒకటి. ఇక్కడ నుంచి గత ఎన్నికలలో టీడీపీ తరఫున దివంగత లోక్‌స‌భ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ పోటీ చేయగా.. వైసీపీ నుంచి పోటీ చేసిన చింతా అనురాధ విజయం సాధించారు. అయితే ఈసారి వైసీపీ సిట్టింగ్ ఎంపీ అనురాధను పక్కనపెట్టి గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుకు ఎంపీ సీటు ఇచ్చి అమలాపురం పార్లమెంట్ బరిలో దింపింది వైసీపీ అధిష్టానం.

అమలాపురం పార్లమెంటు పరిధిలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు ఈ మూడు ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్లతో పాటు కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం జనరల్ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా చాలా బలంగా ఉంది. అలాగే బీసీల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గం కూడా రాజకీయంగా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. అలాగే పార్లమెంటు పరిధిలో ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గం ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. మూడు  ఎస్సీ సెగ్మెంట్లు వ‌దిలేస్తే నాలుగు జ‌న‌ర‌ల్ స్తానాల్లో కూట‌మి ఒక శెట్టిబ‌లిజ‌, ఒక కాపు, ఒక క్ష‌త్రియ‌, ఒక క‌మ్మ‌కు సీట్లు కేటాయించింది.

ఇక వైసీపీ ఒక రెడ్డి, ఒక శెట్టిబ‌లిజ‌, ఒక మ‌త్స్య‌కార‌, ఒక కాపుకు సీట్లు ఇచ్చింది. ఎన్నికల హడావుడి ప్రారంభం కావడానికి ముందు నామినేషన్ల పర్వం.. ప్రచారం, పోలింగ్ ముగిశాక ఎలా చూసుకున్న బాలయోగి తనయుడు ఏకంగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అన్న అంచనాలు, నివేదికలే ఎక్కువగా వినిపించాయి అయితే ఈరోజు జరిగిన కౌంటింగ్ లో హ‌రీష్ ఏకంగా 2 ల‌క్ష‌ల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. అలా త‌న తండ్రి స్పీక‌ర్ ప‌నిచేసిన లోక్‌స‌భ‌లో ఈ రోజు హ‌రీష్ ఎంపీ గా అడుగు పెట్ట‌బోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: