కాకినాడ సిటీ : వైసీపీ ద్వారంపూడి పాల‌న‌కు కొండ‌బాబు చ‌ర‌మ‌గీతం..!

RAMAKRISHNA S.S.
కాకినాడ సిటీ.. ఈ ఎన్నికలలో చాలా హాట్ హాట్ సీట్లలో ఒకటిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య గత కొద్ది నెలలుగా మాటలు యుద్ధం జరుగుతూ వచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్‌కు దమ్ముగా సవాల్ చేశారు. పవన్ క‌ళ్యాణ్‌పై విమర్శలు చేయడంతో పాటు.. ఇది ఎన్నికలలో ద్వారంపూడిని ఎలాగైనా ఓడిస్తానని జనసేన అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయిస్తానని స‌వాల్ విస‌ర‌డం చేశారు. అయితే పొత్తులో భాగంగా సిటీ నుంచి టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మరోసారి పోటీ చేశారు. కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ పోటీలో ఉన్నారు.

అయితే రూరల్ సీటును జనసేనకు ఇవ్వడంతో ఆ ప్రభావం కాకినాడ సిటీపై గట్టిగా పడింది. దీనికి తోడు కాకినాడ పార్లమెంటు సీటు నుంచి జనసేన పోటీ చేయటం.. ఇదే పార్లమెంటు పరిధిలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడంతో ఈ పార్లమెంటు పరిధి మొత్తం మీద జనసేన ప్రభావం చాలా బలంగా పనిచేస్తుందని.. చెప్పాలి. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇక వనమాడి కొండబాబు, ద్వారంపూడి మధ్య గత నాలుగు ఎన్నికల్లోను పోటీ జరుగుతూ వస్తోంది. వీరిద్దరూ ఇది నాలుగోసారి పోటీ పడుతున్నారు.

ఎన్నికల ప్రచారం, నామినేషన్ పర్వం, పోలింగ్ సరళి పరిశీలిస్తే కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గట్టి పోటీ ఇచ్చిన నియోజకవర్గంగా కాకినాడ సిటీకి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే పోలింగ్ తర్వాత ఇక్కడ కూడా స్వల్ప మెజార్టీతో కూటమి అభ్యర్థి కొండబాబు గెలుస్తాడని ఎక్కువ మంది చెబుతూ వచ్చారు ఈరోజు జరిగిన కౌంటింగ్ లో వ‌న‌మాడి కొండబాబు 56572 ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇది మామూలు విజ‌యం కాదు.. కొండ‌బాబు హిస్ట‌రీలోనే అతి పెద్ద విజ‌యం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: