కొత్తపేట : బండారు వైసీపీని బాది ప‌డేశాడు.. మెజార్టీతో చుక్క‌లు చూపించాడు..!

RAMAKRISHNA S.S.
కోనసీమ ముఖద్వారంగా చెప్పుకునే నియోజకవర్గం కొత్తపేట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నియోజకవర్గాలలో కొత్తపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో రావులపాలెం నగర పంచాయతీ తో పాటు రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు విస్తరించి ఉన్నాయి. అయితే 2014, 2019 రెండు ఎన్నికలలోను ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ రెండు ఎన్నికలలో ఆయన స్వల్ప మెజార్టీతో గెట్టెక్కారు. 2004, 2009, 2014, 2019, 2024 ఇలా వరుసగా గత ఐదు ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల తరఫున జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు పోటీపడుతూ వస్తున్నారు.

వీరిద్దరి మధ్య ఇప్పటివరకు నాలుగు సార్లు జరిగిన పోరులో.. మూడుసార్లు జగ్గిరెడ్డి విజయం సాధిస్తే.. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు జగ్గిరెడ్డి పై విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో ఓడిన సత్యానందరావుకు.. చంద్రబాబు మరోసారి సీటు కేటాయించారు. అయితే గత ఎన్నికలలో సత్యానందరావు సోదరుడు బండారు శ్రీనివాసరావు జనసేన పార్టీ తరపునుంచి పోటీ చేసి ఏకంగా 36వేల ఓట్లు సాధించారు.

దీంతో సత్యానందరావు కేవలం నాలుగువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికలలోను సత్యానందరావు కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత రెండు ఎన్నికల్లోను ఓడిపోయిన సానుభూతితో పాటు ఈసారి సోదరులు ఇద్దరు కలిసి పని చేయటం జనసేన కూటమి పొత్తు నేపథ్యంలో.. కొత్త‌పేట లో బంపర్ మెజార్టీతో సత్యానందరావు గెలుస్తారన్న భారీ అంచనాలు ఎన్నికలకు ముందే వచ్చేసాయి ఈరోజు జరిగిన కౌంటింగ్ లో 54134 భారీ మెజార్టీతో సూప‌ర్ కొట్టారు. ఇక గ‌తంలో టీడీపీ ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం నుంచి ఎమ్మెల్ గా గెలిచిన బండారు ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ నుంచి బంప‌ర్ విక్ట‌రీ కొట్టారు. 2009 త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓడి ఈ సారి ఘ‌న‌విజ‌యంతో అసెంబ్లీ లోకి అడుగు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: