చేసేది రాజకీయం.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వర్క్ అవుట్ అవ్వలేదా?

Divya
నాయకుడు.. నిజమైన నాయకుడు అంటే ప్రజలలో నమ్మకం పొందాలి.. రాజకీయం గానో లేక ఎమోషనల్ గానో బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. అయితే ఇక్కడ చేసేది రాజకీయమే అయినా ప్రజలలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే పలు రకాల ప్రచారాలు కూడా చేపట్టారు.. బస్సు యాత్ర , సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ఎన్నో రకాల పేర్లతో ప్రజలలోకి వెళ్తూ మళ్లీ గెలవాలనే నేపథ్యంలో ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ చేశారు ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తాను మీ బిడ్డని అని.. తాను చేసిన మంచి తమకు జరిగితే ఓటు వేయాలి అని... తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఓటు వేయాలి అని. తాను ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమకు లబ్ధి చేకూరైతేనే ఓటు వేయాలని.. తాను మంచి చేశానని నమ్మితేనే ఓటు వేయాలని ఇలా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి..
ఒకరకంగా చెప్పాలి అంటే ఇది కూడా ఎమోషనల్ రాజకీయమే అని చెప్పడంలో సందేహం లేదు.. ఎలాగైనా సరే  అధికారంలోకి రావాలి అంటే ప్రజలను ఏదో రకంగా మభ్య పెట్టాలి. అప్పుడే గెలుస్తాము అనే ఒక కోణంలో మాత్రమే నాయకులు ఆలోచిస్తారు..కానీ ఇక్కడ ఓటర్ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకోరు. ఇదే ఇక్కడ దెబ్బతీస్తుంది అనడంలో సందేహం లేదు.  ముఖ్యంగా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? ఏ కోణంలో ఆలోచిస్తున్నారు అనేది తెలియాలి అంటే ముఖ్యంగా వారి మధ్యలోకి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే ఇలా ఓటమి చవిచూడాల్సి వస్తుంది..  

ఇలా  పెద్ద ఎత్తున చేసిన తప్పిదమే ఇక్కడ ఓటమిపాలయ్యేలా చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే వైసీపీ ప్రభుత్వం ఎమోషనల్ అనే పదాన్ని వాడుకుంటూ ప్రజలను రాజకీయంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలవాలని చూసింది.. కానీ ఓటర్లు వైసీపీని అతి ఘోరంగా ఓడించారని చెప్పడంలో సందేహం లేదు.. కనీసం 25 స్థానాలలో కూడా ఇప్పటివరకు ఆధిక్యత చూపించలేకపోయింది వైసీపీ ప్రభుత్వం ..మరి మొత్తంగా కూటమి అధికారంలోకి రాబోతోందని అది కూడా అఖండ విజయంతో గెలవబోతోందని తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: