ఏపీ ఎన్నిక‌లు... వైసీపీకి చిమ్మ చీక‌ట్లు... వామ్మో ఈ షాకులు చూడండి...

RAMAKRISHNA S.S.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల కౌంటింగ్ లో అధికార వైసీపీకి దిమ్మ తిరిగే షాకులు త‌గిలాయి. కౌంటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఐదారు రౌండ్ల ఓట్లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎక్క‌డ చూసినా టీడీపీ దూసుకు పోతోంది. ఇక కౌంటింగ్‌లో హైలెట్స్ ఇలా ఉన్నాయి. అస‌లు సిక్కోలు నుంచి మొద‌లు పెట్టి విజ‌య‌న‌గ‌రం , విశాక‌ప‌ట్నం తో పాటు రెండు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఇటు గుంటూరు , విజ‌య‌వాడ‌... ప్ర‌కాశం, నెల్లూరు తో పాటు రాయల సీమ జిల్లాల్లోని చిత్తూరు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లోనూ భారీ ఆధిక్యంలో దూసుకు పోతున్నారు కూట‌మి అభ్య‌ర్థులు..

కూట‌మి విజ‌యం .. హైలెట్స్ ఇలా ఉన్నాయి..

- ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ ... కూట‌మి దెబ్బ‌కు వైసీపీ ఫ్యాన్ క‌కావిక‌ల‌మైపోయింది.
- దాదాపు 145 కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్ల‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి అభ్య‌ర్థులు
- కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్ పార్టీ నేత‌లు
- ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన కూటమి

- జిల్లాలకు జిల్లాలే స్వీప్‌ చేస్తున్న కూటమి
- ఉత్తరాంధ్రను ఊడ్చేస్తున్న కూటమి
- రాయలసీమలోనూ కూటమి జోరు
- కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా
- రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి జోరు

- అస‌లు కొన్ని సంవ‌త్స‌రాలుగా పార్టీ గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ దూకుడు... 20 - 25 ఏళ్లుగా టీడీపీ జెండా ఎగ‌ర‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కూట‌మి అభ్య‌ర్థులు దూసుకు పోతున్నారు.
- ఉమ్మడి గోదావరిలోనూ దూసుకుపోతున్న కూటమి
- దక్షిణ కోస్తాలోనూ పరుగులెడుతున్న సైకిల్‌
- ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు
- సీఎం సొంత జిల్లాలోనూ గట్టి పోటీ ఇస్తున్న కూటమి
- ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల లో కూట‌మి అభ్య‌ర్థులు అయితే ఏకంగా వేల ల్లోనే భారీ మెజార్టీలు సాధిస్తూ దూసుకు పోతున్నారు.

- ఇక మంత్రులు అంద‌రూ కూడా ఓట‌మి బాట‌లో ఉన్నారు. పెద్ది రెడ్డి అయితే ఒక రౌండ్‌కు వెన‌క‌ప‌డుతూ.. ఒక రౌండ్‌కు ముందంజ‌లో ఉంటూ వెళుతున్నారు.
- రోజా అయితే 10 వేల ఓట్లు వెన‌క‌ప‌డిపోయింది... అంబ‌టి రాంబాబు కూడా వెన‌క‌ప‌డిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: