ఏకపక్షంగా స్వీప్ చేస్తు దూసుకుపోతున్న టిడిపి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ పోలింగ్ జరిగినట్లుగా ఇప్పుడు కనిపిస్తోంది. ఎక్కడా కూడా వైసిపి గెలిచేందుకు అవకాశం కల్పించలేదు. దాదాపుగా ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేదని జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈవీఎంల ద్వారా బయటపడుతున్నది. ఎర్లీ ట్రేండింగ్లో భారీ స్థాయిలో టిడిపి పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ ఉన్నది. ఇక కూటమి కూడా టిడిపి పార్టీ అధికారం వచ్చేలా కనిపిస్తోందంటు నేతలు కూడా చాలా ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాలలో కూడా ఫ్యాన్ పార్టీ ఆదిత్యంలో కనిపించలేదు.

అలాగే ఎమ్మెల్యే స్థానాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం కూడా కూటమివైపు ఎక్కువగా ప్రజలు ముగ్గు చూపినట్లుగా కనిపిస్తున్నది.. ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా సైకిల్ వేగమే కనిపిస్తున్నది.. బిజెపి జనసేన కూడా చాలా బలంగానే అన్నిచోట్ల కనిపిస్తోంది. స్టేట్ వైడ్ గా చూస్తూ ఉంటే సైకిల్ పార్టీ లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏకపక్షంగా ఓటింగ్ జరిగినట్లుగా కూడా కనిపిస్తోంది.. చాలామంది మంత్రులు సీనియర్ నేతలు కూడా వైసిపి పార్టీ నుంచి వెనుకంచిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఏపీ ప్రజలు గుంపు గుత్తుగా కూటమి వైపుగా మగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా జగన్ పార్టీకి గెలిచే అవకాశం లేదనే విధంగా కూడా కనిపిస్తోంది. ఎర్లీ ట్రెండింగ్ లో కూడా ఇలా అనుకోవడానికి ఏమీ లేదు కానీ జనం చాలా కసితో జగన్కు వ్యతిరేకంగానే ఓట్లు వేశారని చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలో ఎక్కడ కూడా వైసీపీ పార్టీ అనుకూలంగా ఓటు పడలేదని ముఖ్యంగా మహిళలు అత్యధికంగా టిడిపి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.ఉద్యోగులు, మహిళలు, పురుషులు అన్ని వర్గాల వారు కూడా ఏకపక్షంగా వైసిపి పార్టీకి చాలా వ్యతిరేకంగానే నిలబడ్డారని విధంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో పూర్తిగా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: