ఏపీ ఉద్యోగులు: బాబుకే సలాం.. జగన్ కి చుక్కలు..

Divya
తాజాగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలయింది.. అటు కూటమి తరపున టిడిపి ఇటు వైసిపి పోటాపోటీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీ ఉద్యోగులంతా వన్ సైడే ఓటు వేసినట్లు తెలుస్తోంది.. మొత్తంగా ఏపీ ఉద్యోగులలో చాలావరకు వైసీపీకి షాక్ ఇస్తూ టిడిపికి సలాం కొట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే 30 స్థానాలలో కూటమి ముందంజలో ఉన్నట్లు తాజా సమాచారం వెలువడింది. ఇప్పటికీ ఇంకా వైసీపీ ఒక ఖాతా కూడా తెరవలేదు.. ప్రత్యేకించి కడప అడ్డగా ఉన్న వైసీపీలో ఒక్క ఖాతా కూడా తెరవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ రేంజ్ లో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఉద్యోగస్తులంతా కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులు వేసిన ఓట్లను లెక్కించగా చాలావరకు టిడిపికే సలాం కొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ  ఒక్క ఖాతా కూడా తెరవలేదు. మొత్తంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రకారం టిడిపి ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చంద్రబాబు నాయుడు,  పవన్ కళ్యాణ్ వీరంతా కూడా మొదటి రెండు రౌండ్లలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అప్పుడే వీరంగం సృష్టిస్తూ ఉండడం గమనార్హం.

ఇక తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం తొలి రెండు రౌండ్ లలో లో టిడిపి ఆదిక్యంలో ఉంది..  వైసీపీ తాజాగా ఒక ఖాతా మాత్రమే తెరిచినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు 30చోట్ల టిడిపి ఆధిక్యంలో ఉండగా.. కేవలం ఒక్కచోట మాత్రమే వైసిపి ఆధిక్యంలో కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఉద్యోగస్తులంతా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడుకే సలాం కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పులివెందుల , కావలిలో వైసిపి ఖాతా తెరిచినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: