బైబై హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రితో ఇక ఆ రెండు బంధాలు తెగిపోయాయ్‌..!

RAMAKRISHNA S.S.
- ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా ఏపీకి జీరో ప్ర‌యోజ‌నం
-  భాగ్య‌న‌గ‌రితో తెగిన రాజ్యాంగ‌, చ‌ట్ట‌ప‌ర బంధం
( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )
మ‌రో మూడు రోజుల్లో అంటే జూన్‌2 తేదీతో ఏపీకి ఉన్న ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌తో రాజ్యాంగ ప‌ర మైన‌.. చ‌ట్ట ప‌ర‌మైన బంధం తెగిపోనుంది. దీనిని మ‌రో ప‌దేళ్ల పాటు కొన‌సాగించాల‌నే డిమాండ్లు వ‌స్తున్నా యి. ఇప్ప‌టికే ప‌లువురు ఈ దిశ‌గా డిమాండ్లు కూడా చేశారు. 2014లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా హైద‌రాబాద్ తెలంగాణ‌కే రాజ‌ధానిగా ప‌రిమితం కానుంది. అయితే.. ఏపీలో కొత్త రాజ‌ధాని నిర్మాణం చేసుకునే వ‌ర‌కు మాత్రం హైద‌రాబాద్ ఉమ్మడి రాజ‌ధానిగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

దీనికి కూడా ప‌దేళ్ల స‌మ‌యం నిర్ణ‌యించారు. అయితే.. ఆ ప‌దేళ్లు కూడా.. వ‌చ్చే జూన్ 2వ తేదీతో ముగియ నుంది. వాస్త‌వానికి ప‌దేళ్ల‌పాటు హైద‌రాబాద్‌తో ఉమ్మ‌డి రాజ‌ధాని అనుబంధం ఉన్నా.. ఈ ప‌దేళ్ల‌లో ఏపీ ప్ర‌జ‌ల‌కు అధికారికంగా ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌నే చెప్పాలి. 2015లోనే అప్ప‌టి చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ను వ‌దిలేసి ఏపీకి వ‌చ్చేశారు. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించి.. తాత్కాలిక హైకోర్టు (స‌ర్కారు చెప్పిన మేర‌కు), తాత్కాలిక స‌చివాలయం.. ఇత‌ర‌త్రా భ‌వ‌నాలు నిర్మించుకున్నారు.

దీంతో పాల‌న ప‌రంగా హైద‌రాబాద్‌తో బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇక‌, త‌ర్వాత‌.. అధికారంలోకి వ‌చ్చి న సీఎం జ‌గ‌న్ కూడా.. తాడేప‌ల్లి నుంచి పాలన సాగించారే త‌ప్ప‌.. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్‌లో కూర్చుని ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు. సో.. ఎలా చూసుకున్నా.. పాల‌న పరంగా హైద‌రాబాద్ ఎప్పుడో దూర‌మైంది. ఇక‌, ఉన్న‌ద‌ల్లా ఆస్తులు.. అప్పులు మాత్ర‌మే. ఈ రెండు పంచుకునే ప్ర‌క్రియ క‌నుక .. ముందుకు సాగితే.. వాటి విష‌యం కూడా తేలిపోతుంది.

దీంతో పాల‌న ప‌రంగా.. ప్ర‌భుత్వ‌ప‌రంగా.. చ‌ట్టం ప‌రంగా అయితే.. హైద‌రాబాద్‌కు ఉన్న కాల ప‌రిమితి తీరిపోతుంది. ఇక నుంచి ఏ ప్ర‌భుత్వానికి.. ఆ ప్ర‌భుత్వమే సుప్రీంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అయితే.. హైద‌రాబాద్ లేని కార‌ణంగా.. ఇత‌ర సామాజిక వ‌ర్గాలు.. ప్ర‌జ‌ల‌పై మాత్రం ప్ర‌భావం చూపించే అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: