కడప మెజారిటీ లేక్కలే వేరబ్బా.. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ మెజారిటీ వేరే లెవెల్!

Reddy P Rajasekhar
ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఈ 10 నియోజకవర్గాల్లో కనీసం 8 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ నియోజకవర్గాల్లో మెజారిటీ కూడా భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, కడప, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడం పక్కా అని తెలుస్తోంది.
 
మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బద్వేల్ లో వైసీపీ నుంచి డాక్టర్ సుధ పోటీ చేయగా కమలాపురం నుంచి పి.రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎం.సుధీర్ రెడ్డి పోటీ చేశారు. పులివెందుల నుంచి వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి, కడప నుంచి ఎం.అంజాద్ బాషా పోటీ చేయడం గమనార్హం.
 
రైల్వే కోడూరు నుంచి వైసీపీ తరపున కె. శ్రీనివాసులు పోటీ చేయగా రాజంపేట నుంచి ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, రాయచోటి నుంచి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి పోటీ చేశారు. పులివెందులలో జగన్ మెజార్టీ లక్షకు అటూఇటుగా ఉంటుందని పైన పేర్కొన్న మిగతా నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ అభ్యర్థులకు 20 నుంచి 30 వేల రేంజ్ లో మెజారిటీ రావడం ఖాయమని చెప్పవచ్చు.
 
వైసీపీ తరపున పోటీ చేయడమే ఈ అభ్యర్థుల అదృష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కడప జిల్లా జగన్ కు వైసీపీకి కంచుకోట అని ఇక్కడ జగన్ మాటకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఉమ్మడి కడప జిల్లాలో అద్భుతమైన ఫలితాలతో జగన్ కచ్చితంగా సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. కడప జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా ఉండకపోవచ్చని కొన్ని కామెంట్లు వినిపిస్తున్నా ఆ కామెంట్లు ఏ మాత్రం నిజం కాదని తేలడానికి కూడా మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: