ఏపీ ఎలక్షన్స్: జూన్ 4వ తేదీన బంద్.. వారికి నో ఎంట్రీ..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. దీంతో జూన్ 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ మొత్తం బంద్ వాతావరణం ఏర్పడనుందట. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛత ఘటనలు జరగకుండా ఉండేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలలో కేంద్ర బలగాలతో పాటు భారీ బందోబస్తును కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాలలో కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు తలెత్తుతాయని ముందుగానే ఎలక్షన్ కమిషనర్ గుర్తించి పోలీసులను సైతం అప్రమత్త చేస్తున్నారట.

అలాగే కౌంటింగ్ ముందు రోజు ఆ రోజు నియోజవర్గాలలోని ఉండే వారిలో కొత్తవారికి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు కూడా పెట్టారు. కొత్తవారు ఎవరు అనుమతి లేనిదే నియోజకవర్గాలలోకి అడుగుపెట్టకూడదంటూ పోలీసులు తేల్చి చెబుతున్నారు అలాగే లాడ్జిలో ఎవరు ఉన్నా కూడా ఇవ్వవద్దు అంటూ లార్జ్ యాజమాన్యులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు జరగకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు ఈసీ తీసుకుంది అంటే తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమరిలో ఉంది కాబట్టి గుంపులుగా ఉన్న అరెస్టు చేస్తారని హెచ్చరిస్తున్నారు.

అలాగే ఎవరైనా బాణసంచా ప్రదర్శించిన బైకులు తిప్పినా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నారు. మరొకవైపు ఆర్టీసీ బస్సులను కూడా పట్టణాలకు వెలుపలే ఆపాలను కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు దీని వల్ల ప్రభుత్వ ఆస్తులకు ఏదైనా అవాంఛిత సంఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలియజేస్తున్నారు.ఎవరైనా ప్రయాణాలు చేయాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిదని ముందు సూచనలు తెలియజేస్తున్నారు. వీటితో పాటు మద్యం ఎక్కడైనా అమ్మినట్లుగా కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసివేయాలని తెలియజేస్తున్నారు.  పెట్రోల్ కూడా విడిగా బాటిల్లో పోస్తే పెట్రోల్ బంకుల పైన తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: