ఏపీ: పోలింగ్ పెరిగింది... ఎవ‌రికి దెబ్బ ప‌డిపోతోందంటే...?

RAMAKRISHNA S.S.
పోలింగ్ శాతం.. పెర‌గ‌కూడ‌ద‌ని స‌హ‌జంగా అధికారంలో ఉన్న పార్టీలు కోరుకుంటాయి. ఇక‌, పోలింగ్ శా తం పెర‌గాల‌ని ప్ర‌తిపక్షంలో ఉన్న పార్టీలు లెక్క‌లు వేసుకుంటాయి. 2014లో 77 శాతం పోలైన ఓట్లు 2019కి వ‌చ్చే స‌రికి రెండు శాతం పెరిగాయి. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ 81 శాతానికి పైగానే ఓట్లు పోల‌య్యాయి. అంటే లెక్క‌ల ప్ర‌కారం 2 శాతం మేర‌కు ఓట్ల పోలింగ్ పెరిగింది.

ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవ‌రికి లాభం..?  ఎవ‌రికి న‌ష్టం? అనేది ఆస‌క్తిగా మారింది. స‌హ‌జంగానే అధికా రంలో ఉన్న పార్టీకి వ్య‌తిరేక‌మ‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదేస‌మ‌యంలో టీడీపీ కూడా ఇదే అంచ‌నాతో ఉంది. కూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే.. స‌హ‌జంగా ఇప్పుడు మారుతు న్న ఓటరు నాడిని ప‌రిశీలిస్తే.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లోనూ.. జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌రు తీర్పును గ‌మ‌నిస్తే.. ఆయా రాష్ట్రాల్లో గ‌తంలో జ‌రిగిన ఓటింగ్ శాతం కంటే త‌గ్గింది.

దీంతో క‌ర్ణాట‌క‌లో బీజేపీ, త‌మిళ‌నాడులో ఎండీఎంకే తిరిగి అధికారంలోకి వ‌స్తాయ‌ని లెక్కలు వ‌చ్చాయి. కానీ, క్షేత్ర‌స్థాయిలో అక్క‌డ  ప‌రిస్థితి భిన్నంగా న‌మోదైంది. ప్ర‌తిప‌క్షాలు అధికారంలోకి వ‌చ్చాయి. ఇక‌, జాతీయ స్థాయిలో చూసుకుంటే.. 2014తోపోల్చుకుంటే.. 2019 ఎన్నిక‌ల్లో ఈ ఓట్ల శాతం పెరిగింది. దీంతో న‌రేంద్ర మోడీ ప‌ని అయిపోయింద‌ని లెక్క‌లు వేసుకున్నారు. కానీ, ఆయ‌న రెండోసారి కూడా భారీ విజ‌యం న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

కాబ‌ట్టి.. ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రానఅధికార పార్టీకి వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని చెప్ప‌లేం. ఢిల్లీలో నూ గ‌త ఎన్నిక‌ల్లో ఇదే జ‌రిగింది. ఇక్క‌డ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిం ది. రెండో సారి పోలింగ్ శాతం విప‌రీతంగా పెరిగింది. అయినా.. కేజ్రీవాల్ విజ‌యం ద‌క్కించుకున్నారు. భారీ సీట్లు కూడా కైవ‌సం చేసుకున్నారు. అంటే.. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పోలింగ్ శాతం కొంత‌వ‌ర‌కు ప్ర‌భావితం చేసినా.. అంచ‌నాలు ఇత‌మిత్థంగా చెప్పే ప‌రిస్తితి అయితే క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏపీలో ఏం జ‌రుగుతుంద‌నేది జూన్ 4నే తేల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: