షాకింగ్ : ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఆ గ్రామమే పోలింగ్ ను బహిష్కరించింది?

praveen
17 పార్లమెంటు స్థానాలకు గాను తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది   అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక  కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేసిన అభ్యర్థుల భవితవ్యం ఏంటో తేల్చేందుకు ప్రస్తుతం ఓటర్ మహాశయులు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాలు అన్ని ఓటర్లతో నిండిపోయాయి అని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు ఇక ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

 ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొన్ని చోట్ల మందకోడిగానే సాగుతుంది అని చెప్పాలి. అయితే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంది. కాగా అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ.. బిజెపి అభ్యర్థి మాధవి లత మధ్య తీవ్రస్థాయిలో పోటీ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో హైదరాబాద్లో ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. రెండు గంటల్లో అక్కడ 5.09% మాత్రమే ఓటింగ్ శాతం నమోదయింది అని చెప్పాలి.

 ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రతిష్ట  బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు పోలింగ్ ను పూర్తిగా బహిష్కరించడం సంచలనగా మారింది. ఎన్కూర్ మండలం రాయ మదారం గ్రామ ప్రజలు పోలింగ్ బహిష్కరించారు. ఎన్ఎస్పి కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. వంతెన నిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా కనుముక్కలలో తడిసిన ధాన్యంతో రైతులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇక ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తామని నిరసన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: