ప‌ర్చూరు ప‌దిలం... పోలింగ్ రోజే ' టీడీపీ ఏలూరి ' గెలుపు...!

RAMAKRISHNA S.S.
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం పేరు ఏపీ పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో అనూహ్యంగా మార్మోగుతోంది. ఇక్క‌డ వార్ పోలింగ్ రోజే వ‌న్‌సైడ్ అయిపోయింద‌న్న చ‌ర్చ బ‌లంగా న‌డుస్తోంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో టీడీపీ యువ నాయ‌కుడు ఏలూరి సాంబ‌శివ‌రావు దూసుకుపోతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు.. అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉన్నాయి. ఎంత‌గా అంటే.. పొలం గ‌ట్టున నిత్యం ఉండే రైత‌న్న ద‌గ్గ‌ర కూడా ఎమ్మెల్యే ఏలూరి ఫోన్ నెంబ‌ర్ ఉండేంత‌గా..!

ఇది ఆశ్చ‌ర్యం కాదు. నిజ‌మే. నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కాదు.. క‌నీసం నెల‌లో రెండు సార్లు ఆయ‌న రైతుల‌తో భేటీ అవుతారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. స్వతః సిద్ధంగా ఎమ్మెల్యే ఏలూరి కూడా రైతు కుటుంబం నుంచి రావ‌డంతో ఆయ‌న ఇప్ప‌టికి వ్య‌వ‌సాయంలో ఉన్నారు. నానో ఎరువుల నుంచి అనేక సాంకేతిక స‌హ‌కారాల వ‌ర‌కు ఆయ‌న స్థానిక రైతుల‌కు అందుబాటులో ఉంటారు. ఇక‌, మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించ‌డంలోనూ ముందున్నారు.

ఇదిలా వుంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేసిన వైసీపీ.. ఎలాగైనా ఏలూరిని ఓడించాల‌నే ల‌క్ష్యంగా కొంద‌రు నాయ‌కులు ఇక్క‌డి అధికారుల‌తో కుమ్మ‌యి.. దాదాపు 10 వేల‌కుపైగా టీడీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గించారు. దీంతో ఏలూరి గెలుపు ఇక సాధ్యం కాద‌ని అధికార పార్టీ నేత‌లు అంచ‌నా వేసుకుని ఉండొచ్చు. కానీ, ఇదే విష‌యంపై సీరియ‌స్‌గా స్పందించిన ఏలూరి న్యాయ పోరాటం చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. పర్చూరు లో  తొలగించిన 10వేల చిలుకు ఓట్లను యదావిదిగా కొనసాగించా లంటూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి తొలగించిన 10 వేల ఓట్ల‌కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా వివరణలు తీసుకోకుండా పోస్ట్ చేశార‌న్న టీడీపీ వాద‌న‌ను కూడా హైకోర్టు స‌మ‌ర్థించింది. అంతేకాదు.. ఇలా ఎలా చేస్తారంటూ నిల‌దీసింది. అసంబద్దంగా ఉన్న అధికారుల వివరణ నివేదికలు చూస్తే ఇందులో ఉద్దేశం ఏంటో అర్ధమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. తొల‌గించిన 10 వేల ఓట్ల‌ను త‌క్ష‌ణ‌మే పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించింది. ఏలూరిని ఎలాగైనా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న జ‌గ‌న్ ఈ ఐదేళ్ల‌లో న‌లుగురు ఇన్‌చార్జ్‌ల‌ను మార్చారు.

చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఎడం బాలాజీని తీసుకొచ్చి పెట్టారు. ఆయ‌న‌కు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఊళ్లూ... బోర్డ‌ర్‌, బౌండ‌రీలే తెలియ‌వు. అస‌లు వైసీపీ కేడ‌రే ఎవ‌రో తెలియ‌దు. దీంతో ఓవ‌రాల్‌గా పోలింగ్ రోజుకే ప‌రుచూరులో ఎమ్మెల్యే ఏలూరి గెలుపు ఖాయ‌మైంద‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటోన్న ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: