రాయలసీమ ( రాయచోటి): టీడీపీ కి షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

Divya
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట.. అక్కడ నుంచి గండికోట శ్రీకాంత్ ఉప ఎన్నికలతో పాటు ఇప్పటివరకు నాలుగు సార్లు గెలిచారు.. అయితే ఈయన చేతిలో రెండు సార్లు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి పరిస్థితిని గమనించిన టిడిపి అధిష్టానం ఎన్నోసార్లు సర్వే చేయించిన అది ఆయనకు అనుకూలంగా రాకపోవడంతో.. అక్కడ అభ్యర్థుల పైన జిల్లా నాయకులతో మంతనాలు జరిపి చివరికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చినారు.
దీంతో గత కొద్దిరోజులుగా రమేష్ రెడ్డి టిడిపి అధిష్టానం పైన అసంతృప్తిని తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండటంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో అక్కడ పరిస్థితిని గమనించిన ఆయన రమేష్ రెడ్డితో మాట్లాడారు. అయితే చివరకు నిన్నటి రోజున రాత్రి ఎంపీ మిధున్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.. పార్టీలో కచ్చితంగా తమకు స్థానం ఇస్తామని ఆయన వర్గీయులకు కూడా తెలియజేశారు అయితే సీటు పైన ఎలాంటి హామీ ఇవ్వలేదు.. దీంతో ఈనెల 9వ తేదీన వైసీపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి వైసీపీ ప్రకటించడమే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని కాదని మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదు.. అయినప్పటికీ కూడా టిడిపిలో ఉండే అసంతృప్తిల వల్ల పలువురు నాయకులు , కార్యకర్తలు కూడా వైసీపీలోకి చేరుతున్నారు.. ముఖ్యంగా తెలుగు కడప జిల్లా అధ్యక్షుడు పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి సోదరుడే ఈ రమేష్ రెడ్డి.. సొంత అన్న చెప్పినా కూడా రమేష్ వినలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. వైసిపి పార్టీలోకి రమేష్ రెడ్డి రావడంతో తమకు బాగా కలిసొస్తుందని ఎంపీ అభ్యర్థి మిధున్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరి మిథున్ రెడ్డి కోరిక మేరకు రమేష్ రెడ్డి వైసిపి పార్టీలోకి ఈనెల 9వ తేదీన చేరుతారు కాబట్టి మిథున్ రెడ్డి కి ఎలా సహాయ సహకారాలు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: