ఏపీ: హ్యాట్రిక్ రేస్ లో ఆ ఐదుగురు.. మరోసారి వై నాట్..?

Divya
ఎక్కడైనా సరే నాయకులు తమకు అభివృద్ధి చేస్తారు అని ప్రజలు నమ్మితే.. కచ్చితంగా వారికి అధికారాన్ని కట్టబెట్టడానికి ఎప్పుడూ ముందుంటారు.. ఈ క్రమంలోనే ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రజలలో తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న నాయకులు.. మళ్లీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ రేసులో దూసుకుపోతున్నారు. మరి ఈసారి జరగబోతున్న ఎన్నికలలో కూడా మరోసారి వై నాట్ అంటూ హ్యాట్రిక్ రేస్ లో పరిగెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఆ నేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ముందుగా కాంగ్రెస్ లో ఇద్దరు ఆ తర్వాత వైసీపీలో ఐదుగురు వరుస విజయాల పరంపర కొనసాగిస్తూ మొత్తం ఈ ఏడుగురు అభ్యర్థులను ఈసారి విజయం వరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అప్పట్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఆ తర్వాత వైసిపి వ్యవస్థాపకుడు.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ నేతృత్వంలో ఈ ఏడుగురు ఆ పార్టీల జెండా ఎగరవేస్తున్నారు. జిల్లా రాజకీయాలలో పలువురు సీనియర్లు వరుస విజయాలు సాధించి.. 2009 నుండి జరుగుతున్న ఎన్నికలలో వరుసగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు..
ఇప్పటికే 2009 నుండి పోటీ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్,  వైఎస్సార్ కాంగ్రెస్ లో పోటీ చేసి హ్యాట్రిక్ దాటి నాలుగు సార్లు విజయం సాధించగా.. మరో ఐదుగురు రెండుసార్లు విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి వారిని విజయం వరిస్తుందా? వారిలో ఎవరు హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారు? హ్యాట్రిక్ దాటిన ఆ ఇద్దరిలో డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా.. ఐదోసారి విజయం సాధిస్తారా ? అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన అంశం. ఇక వైసిపి అభ్యర్థులుగా హ్యాట్రిక్ రేసులో బరిలోకి దిగుతున్న వారిలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించి.. ఐదోసారి విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలోనే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ రేస్ లో ఉన్నారు. ఇక ఈయనతో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ భాషా, మైదుకూరు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డి , కమలాపురం ఎమ్మెల్యే సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు... మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరు హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: