బీజేపీ:అధికారంలోకొస్తే జరిగేది ఇదే.. ఊహించలేరుగా..?

Divya
దేశంలో బిజెపి పార్టీ మూడవసారి అధికారంలోకి రావాలని భావిస్తూ అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.. అయితే బిజెపి పార్టీకి ప్రతిపక్షంగా పార్టీ బలహీనంగా ఉండడంతో కేంద్రంలో మరొకసారి బిజెపి పార్టీని అధికారంలోకి వస్తోందంటూ ఇప్పటికీ ఎన్నో సర్వే సంస్థలు కూడా వెల్లడించాయి.. ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న సమాచారం ప్రకారం బిజెపి పార్టీ ఈసారి కేంద్రంలో 370 స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.. అయితే 370 సీట్లు సాధించడం వెనుక కూడా బిజెపి పెద్ద ప్లాన్ వేస్తోందని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

కొంతమంది పొలిటికల్ ఎనాలసిస్ట్ ప్రకారం.. 370 సీట్లు అనేది ప్రత్యేక మెజారిటీ నెంబర్ అని.. అందుకే నరేంద్ర మోడీ కూడా చివరి లోక్సభ సమావేశాలలో ఈసారి తమ పార్టీ 370 సీట్లతో అధికారంలోకి వస్తుందంటూ తెలియజేశారు.. లోక్సభలో మొత్తం 545 సీట్లు ఉన్నవి.. అయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 368 ప్రకారం మొత్తం సీట్లలో ఉండేటువంటి వాటిలో మూడవ వంతు 363 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి అంటే ఆ పార్టీకి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ సైతం తొలగించి సవరించి మార్చే హక్కు ఉంటుందట.
అందుకే బిజెపి టార్గెట్ ఈసారి 370 నినాదంతో ముందుకు వెళ్తోందంటూ పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.. ఒకవేళ బిజెపికి అనుకున్న ప్రకారం 370 సీట్లు వస్తే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందంటూ పలువురు పొలిటికల్ ఎనలిస్టుల అంచనాలు తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా కొన్ని రాజ్యాంగంలో సవరణలు చేసే అవకాశం కూడా ఉంటుందని వెల్లడిస్తున్నారు.. హిందూ దేశంగా ప్రకటించే రిజర్వేషన్ రద్దు అవుతుందని చర్చ కూడా జరుగుతోంది. 303 సీట్ల మెజారిటీతో బిజెపి జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370 కూడా రద్దు చేయడం జరిగింది..
ఈసారి 370 సీట్లు వస్తే చాలా మార్పులు వస్తాయట. 2024 పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి సింగిల్గా అధికారంలోకి వస్తుందంటూ ఇప్పటివరకు ఎన్నో సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇదే జరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.. ప్రతిపక్షం బలంగా ఉంటే పాలకులు పనులు సరిగ్గా చేస్తారని పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు. మరి బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించలేరని కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: