ఏపీ : చంద్రబాబు చేసిన పనితో.. జగన్ కు పెద్ద దెబ్బ పడ్డట్టేనా?

praveen
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలకు కూడా ఓటర్ మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఒకవైపు టిడిపి జనసేన బిజెపి పార్టీలు పొత్తుగా ముందుకు సాగుతుంటే.. అటు వైసిపి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమౌతుంది. ఈ క్రమంలోనే ఈసారి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు సత్తా చాటబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న ప్రస్తుత ప్రతిపక్షం టిడిపి.. జగన్ కు అనుకూలంగా ఉండే ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా గత కొంతకాలం నుంచి టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాలంటీర్లు ఏకంగా వైసిపి కార్యకర్తలుగా మారిపోయారని.. వారి పని చేసుకోవడం మానేసి ఏకంగా.. లోలోపల పార్టీ ప్రచారం కూడా చేస్తున్నారంటూ టిడిపి ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇద్దరు వాలంటీర్లపై ఎన్నికల కమిషన్కు కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఫిర్యాదు చేశారు.

 ఇలాంటి పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది   గ్రామ వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. వాలంటీర్ల ద్వారానే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓటర్లకు అర్థమయ్యేలా చెబుతూ.. సీఎం జగన్ ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకోవాలని అనుకున్నారని.. కానీ ఇప్పుడు టిడిపి కేంద్ర ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేయడంతో.. జగన్ వ్యూహాలు తారుమారు అయ్యాయని టిడిపి నేతలు భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cbn

సంబంధిత వార్తలు: