కూటమి వ్యవహారం నాదేండ్ల మనోహర్ మేడకు..!!

Divya
టిడిపి జనసేన బిజెపి కూటమి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పార్టీలలో ఎక్కువగా గొడవలే మొదలయ్యాయి.. ముఖ్యంగా కూటమి గెలిచే ఫలితాన్ని కాస్త పక్కన పెడితే.. టిడిపి గెలిచే కొన్ని సీట్లలో చాలా తలనొప్పులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది.. పిఠాపురం వర్మ కు ఇచ్చి ఉంటే టిడిపి గెలవడానికి కాస్త అనుకూలంగా ఉండేదట. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ రావడంతో ఇప్పుడు వైసీపీ పార్టీ దృష్టి మొత్తం అక్కడే ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెనాలి టికెట్ విషయం పైన కూడా మరొకసారి తెరపైకి రావడం జరిగింది.

పొత్తులో భాగంగా కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీట్లను జనసేనకు ఇస్తున్నారు అంటూ పలువురు టిడిపి నేతలు కూడా చంద్రబాబు పైన ఫైర్ అవుతున్నారు.ఈ విషయంలో రాజోలు టికెట్టు కూడా ఒకటి.. గతంలో ఇక్కడ జనసేన గెలిచిన ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదని తెలుస్తోంది. ఈ సమయంలో పిఠాపురంలో వర్మ కచ్చితంగా గెలుస్తారని టిడిపి నేతలకు చాలా నమ్మకం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ని తీసుకువచ్చి పెట్టడంతో ఆ టికెట్ కూడా ఇప్పుడు నీలి నీడలుగా మారుతున్నాయి.
తెనాలిలో కూడా తమ పార్టీ టిడిపి గెలిచే అవకాశం ఉందా అక్కడ నాయకులు చెపుతున్నప్పటికీ ఆ సమయంలోనే జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు తినాలి సీటును కేటాయించారు. 2014 ఎన్నికలలో నాదెండ్ల పోటీ లేనప్పటికీ.. ఆ ఎన్నికలలో ఆలపాటి రాజా 19 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.. 2019లో నాదెండ్ల మనోహర్ పోటీ చేయక 30 వేల ఓట్లతో ఓడిపోయారు. టిడిపి క్యాడర్ మొత్తం నాదెండ్ల మనోహర్ కు సహకరిస్తేనే గెలుపు పై కాస్త నమ్మకం ఉండవచ్చని పరోక్షంగా టిడిపి నేతలు చేతులెత్తేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టిడిపి జనసేన పార్టీల మధ్య వర్గాలలో తీవ్రమైన అలజడలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో చాలామంది టీడీపీ పార్టీకి గుడ్ బై కూడా చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీట్ల విషయంలో నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోవడంతో అన్ని ఆయన చుట్టూనే చుట్టుకుంటున్నట్టుగా రాజకీయ నాయకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: