ఆ హామీ చెబితే చాలు.. పక్క 120 సీట్లు వైసిపి పార్టీవే..!!

Divya
2024 ఎన్నికలలో వైసీపీ పార్టీ అటు టిడిపి జనసేన బిజెపి కూటమితో చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు ఎదురవుతున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు సైతం ముందుకు వెళుతూ ఉన్నాయి అటు టిడిపి వైసిపి రెండు పార్టీలు కూడా మీమంటే మేము అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు వరుస విజయాన్ని అందుకుంది అదే విధంగా ఆంధ్రాలో కూడా అందుకుంటుందని పలువురు ప్రజలు కూడా తెలుపుతున్నారు.

అయితే ఈసారి కాస్త టఫ్ గానే ఉన్నప్పటికీ కేవలం వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ హామీ చెప్పారంటే కచ్చితంగా ఈసారి అధికారంలోకి వైసీపీ పార్టీనీ ఆపేవారు ఎవరూ లేరని... 2019 లో తాను చెప్పిన విధంగా నవరత్న హామీలను అమలు చేయడమే కాకుండా అన్నిటిని కూడా చాలా పగడ్బందీగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు.. కేవలం ప్రతిపక్ష పార్టీలు కావాలనే వైసీపీ పార్టీని బురదజల్లే విధంగా పెట్టుకున్నారు.. కానీ ఇటీవల సిద్ధం సభలతో చేసిన సభలు సైతం గ్రాండ్గా సక్సెస్ అయ్యాయి.

అందుతున్న సమాచారం ప్రకారం రైతులకు కనీసం లక్ష రూపాయల మేరకు రుణమాఫీ సైతం వైసీపీ ప్రకటిస్తే.. పక్కాగా వైసిపి పార్టీ చేతిలో 110 పైగా సీట్లు వస్తాయని తెలుపుతున్నారు.. ఒకవేళ సీట్లు మరిన్ని కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఈ విషయం పైన సీఎం జగన్ కూడా ఆర్థిక నిపుణులు బ్యాంకు అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన అటు ఏపీ సీఎం ముందడుగు వేస్తారా వెనకడుగు వేస్తారో చూడాలి మరి.. దాదాపుగా  110నుంచి 120 నియోజకవర్గాలలో రైతు రుణమాఫీ మీదే చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. గతంలో టిడిపి ప్రభుత్వం కూడా ఈ హామీ ఇచ్చి విఫలమయ్యింది. అందుకే ఈసారి కూడా ఇలాంటి రుణమాఫీ విషయాన్ని టిడిపి ప్రకటించలేదు.. కేవలం సూపర్ సిక్స్ హామీలను మాత్రమే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: