టిడిపికి షాక్.. వైసీపీలోకి గంటా..!!

Divya
గంటా శ్రీనివాసరావు కెరియర్ ఒక్కసారిగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు వద్ద టికెట్టు విషయంలో చాలా అవమానం జరిగిందని వార్తలైతే వినిపిస్తున్నాయి.. ఆయనకు భీమిలి కావాలని తమ అధినేత చంద్రబాబు నాయుడు ను అడగగా కానీ చంద్రబాబు మాత్రం బొత్సపైన పోటీ నిలబెట్టాలని కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గంటా శ్రీనివాసరావును పొమ్మనలేక ఇలా చేస్తున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి గంటా శ్రీనివాసరావు విశాఖలో నిలబడతాడా అనే విషయం ఇప్పుడు టిడిపి కార్యకర్తలకు ఒక ప్రశ్నార్ధకంగా ప్రశ్నార్థకంగా మారుతోంది.

అయితే గంటా శ్రీనివాసరావు ముందు మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి..అవి ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా లేదా అనే విషయం మాత్రం చెప్పలేం టిడిపి తో గంటాకు ఆల్మోస్ట్ చెడిపోయిందని వార్తలైతే వినిపిస్తున్నాయి.. టిడిపి కాకుండా జనసేన లకి చేరే అవకాశం కూడా ఉన్నాయి.. ఒకవేళ బీజేపీలోకి చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టిడిపి జనసేన బిజెపి ఇలా అన్ని పార్టీలు కూడా కలవబోతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబుని కాదని గంట శ్రీనివాసరావు ఏమీ చేయలేరు..

అలా అని కాంగ్రెస్ లో చేరి మళ్ళీ తన కెరీర్ ని మొదటి నుంచి ప్రారంభించలేరు.. కేవలం మిగిలింది ఒకే ఒక ఆప్షన్ అది వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడం.. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వార్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలకి అవంతి శ్రీనివాసరావు అడ్డుపడ్డారని చెబుతున్నారు. ఒకవేళ ఇప్పుడు గంటా వస్తే వైసిపి ఓకే అంటుందా లేకపోతే నో అంటుందా అనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది.. ఒకవేళ వస్తే భీమిలి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. భీమిలిలో గంట చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని.. పైగా గతంలో కూడా 40,000 ఓట్లకు పైగా తేడాతో గెలిచారు.. ఆర్థికంగా కూడా బలమైన నేత కాబట్టి వైసీపీలోకి వస్తే ఒకవేళ అవకాశం ఉండవచ్చు. ఏది ఏమైనా గంటా కూడా వైసిపి పార్టీ వైపే కాస్త మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: