అమరావతి : అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్

Vijaya





వ్యూహాత్మకమో లేకపోతే సహజస్వభావమో అర్ధంకావటంలేదు. ఒక విషయం గ్యారెంటీ ఏమిటంటే పవన్ కారణంగా తెలుగుదేశంపార్టీ, బీజేపీలోనే కాదు చివరకు జనసేన నేతల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. పవన్ మనసులో ఏమో చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవాలని ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే మిత్రపక్షం బీజేపీతో పొత్తులో ఉన్నా సమస్యలపై పోరాటం పేరుతో చంద్రబాబుతో చేతులు కలిపింది. ఈ సమయంలోనే  రెండురోజుల విశాఖపట్నం పర్యటన కోసం వచ్చిన నరేంద్రమోడీతో పవన్ భేటీఅయ్యారు.



మోడీ, పవన్ భేటీలో ఏమిజరిగిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో పొత్తవసరంలేదు బీజేపీతోనే కలిసుండాలని  మోడీ చెప్పారు. దాంతో ఏమిచేయాలో పవన్ కు దిక్కుతోచటంలేదు. ఈ నేపధ్యంలోనే పవన్ మాటలు పై మూడు పార్టీల్లోను అయోమయాన్ని పెంచేస్తున్నాయి. విజయనగరంలో పవన్ మాట్లాడుతు జనసేనకు ఓట్లేయమన్నారు. జనసేనను అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీతో కూడిన పరిపాలన ఎలాగుంటుందో చూపించేందుకు తనకు ఒక్క ఛాన్సివ్వమని జనాలను అడిగారు.



పవన్ మాటల్లో ఎక్కడా బీజేపీ ప్రస్తావనలేదు. పవర్ స్టార్ మాటలు విన్నతర్వాత జనసేన ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పటంలేదు. ఎంతసేపు జనసేనకు ఓట్లేయమని అడుగుతున్నారే కానీ బీజేపీ ప్రస్తావన మాత్రం తేవటంలేదు. మోడీ ఎఫెక్టు కారణంగా టీడీపీ ప్రస్తావన కూడా తేవటంలేదు.



ఇంతవరకు బాగానే ఉందికానీ ప్రభుత్వంపై పోరాటంలో తమను పవన్ ఎందుకు కలుపుకుని వెళ్ళటం లేదో బీజేపీ నేతలకు అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో పవన్ తో పొత్తును నమ్ముకునే చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు ఇన్చార్జిలను నియమించలేదు. ఇపుడా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించాలో లేదో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. ఫైనల్ గా బీజేపీని ఎందుకు కలుపుకుని వెళ్ళటంలేదో జనసేన నేతలకూ అర్ధంకావటంలేదు. నోటిమాటగా బీజేపీ మిత్రపక్షమని చెబుతున్న పవన్ ఆచరణలో మాత్రం చూపించటంలేదు. దాంతో తమ అధినేత వైఖరి ఏంటో సొంతపార్టీ నేతలకే అర్ధంకావటంలేదు. ఎవరితో పొత్తుంటుంది ? ఎవరితో ఉండదో చివరకు జనసేన నేతలకే అర్ధంకావటంలేదు. మరీ అయోమయం ఎంతకాలం కంటిన్యుచేస్తారో  తెలీటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: