హైదరాబాద్ : మునుగోడులో జగన్ డైరెక్షన్నే కేసీయార్ ఫాలో అవుతున్నారా ?

Vijaya






మునుగోడు ఉపఎన్నికలో గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్నే కేసీయార్ ఫాలో అవుతున్నట్లున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం కేసీయార్ భారీ సంఖ్యలో ఇంచ్చార్జీలను నియమించారు. నియోజకవర్గం మొత్తాన్ని సీఎం 86 యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్ కు ఒక ఎంఎల్ఏని ఇన్చార్జిగా నియమించారు. విజయదశమి అంటే అక్టోబర్ 5వ తేదీన పార్టీ ఆపీసులు జాతీయపార్టీ ప్రకటన అయిన మరుసటి రోజే అందరినీ మునుగోడుకు వెళ్ళిపోమని చెప్పారు.



ఇక్కడ విషయం ఏమిటంటే ప్రతి ఎంఎల్ఏ తన మద్దతుదారులతో కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళి గడపగడపకు ప్రచారం చేయాలన్నారు. 6వ తేదీనుండి రంగంలోకి దిగిన ప్రతి ఎంఎల్ఏ గడపగడపకు ప్రచారాన్ని కనీసం మూడుసార్లు టచ్ చేయాలన్నారు. గడపగడపకు ఎంఎల్ఏలు టచ్ చేయటం ద్వారా మాత్రమే ఓటర్లను ఆకట్టుకోగలమని కేసీయార్ స్పష్టంగా చెప్పారు. గడపగడపకు ప్రచారంలో ఎవరు ఎలాగ పాల్గొంటున్నారనే విషయాన్ని తాను ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటానని కూడా హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికను కేసీయార్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధమవుతోంది. 



కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏలకు చెప్పిన గడపగడపకు ప్రచారం వ్యవహారం చూస్తుంటే ఏపీలో జగన్ చెబుతున్నదే గుర్తుకొస్తున్నదా ? ప్రతి మంత్రి, ప్రతి ఎంఎల్ఏ గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని జగన్ పదే పదే చెబుతున్నారు. జనాలకు దగ్గరగా వెళ్ళటానికి ఇంతకుమించిన పద్దతిలేదని కూడా జగన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు.




సో జగన్ ఎప్పటినుండో చెబుతున్నదాన్నే ఇపుడు మునుగోడు ఉపఎన్నికలో  కేసీయార్ చెప్పారు. అంటే జగన్ డైరెక్షన్ ప్రకారమే కేసీయార్ ఫాలో అవుతున్నట్లు అర్ధమవుతోంది. గెలుపోటములను పక్కన పెట్టేస్తే జనాలను రెగ్యులర్ గా కలవటం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను వివరించటం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పటానికి మంత్రులుల, ఎంఎల్ఏలకు ఇంతకుమించిన మార్గం ఏముంటుంది ? విజయానికి షార్ట్ కట్లు ఉండవని, అందరు కష్టపడాల్సిందే అని జగన్ పదే పదే చెబుతున్నదాన్నే ఇపుడు కేసీయార్ కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: