అమ్మో తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో?

praveen
ఈ భూమ్మీద మనుషులతో పాటు జీవించే జీవరాసులు ఎన్నో ఉన్నాయి. కానీ మనకు తెలిసింది మాత్రం కేవలం కొన్ని మాత్రమే. ఈ క్రమంలోనే కొన్ని వింతైన జీవ రాశుల గురించి తెరమీదకి వచ్చినప్పుడు అది తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవ్వుతూ ఉంటారు అని చెప్పాలి.  ముఖ్యంగా సముద్రంలో లక్షల జీవరాశులు మనుగడ సాగిస్తూ ఉండగా ఇలాంటి వాటిలో కొన్ని వింతైన జీవరాసులు అప్పుడప్పుడు తెరమీదికి వస్తువు అటు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. సముద్రం లో ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి అన్న విషయం ఇక ఇలాంటి జీవరాశులను చూసినప్పుడు నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.

 సాధారణంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించే ఎంతో అందమైన చేపలతో పాటు భయంకరమైన జీవాలు కూడా సముద్రాల్లో ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక మత్స్యకారుడి వలకు ఇలాంటి భయంకరమైన చేప చిక్కింది. దీంతో ఇక ఈ చేప కు సంబంధించిన వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇలా మత్స్యకారుడి వలకు చిక్కింది చేప ఏంటో తెలుసా ఏకంగా తోడేలు రూపంలో ఉండే చేప. ఇది చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాకాసి లాగా పెద్దగా నోరు తెరుచుకుని పదునైన పళ్ళతో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంది ఈ చేప.

 అయితే ఇక ఈ భయంకరమైన చేప వలకు చిక్కడంతో మత్స్యకారులు అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే ఇలాంటి చేపలను తోడేలు చేపలు అని అంటారని నీళ్లు లేకపోయినప్పటికీ బురదలో కూడా ఇవి జీవించగలవు అంటూ మత్స్యకారులు చెబుతుండడం గమనార్హం. ఇక ఇలా వలలో పడిన తోడేలు చేపలు బయటకు తీసేందుకు ప్రయత్నించగా తన చేతిని కొరికేందుకు కూడా పలుమార్లు ప్రయత్నించింది అంటూ చెప్పుకొచ్చాడు  ఓ మత్స్యకారుడు. ఎంతో జాగ్రత్తగా ఆ తోడేలు చేపలను పట్టుకోవడంతో ఇక ఎలాంటి గాయాలు కాలేదు అని తెలిపాడు. వాటిని మళ్లీ సముద్రంలో వదిలేసాము అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: