రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..మరో 97 స్పెషల్ ట్రైన్స్..

Satvika
ఈ మధ్య రాజకీయ చర్చలకు దారి తీసిన ఘటన అగ్నిపథ్ పథకం ను విద్యార్థులు చేసిన నిరసనలు..దాని నుంచి ఇప్పుడిప్పుడే తెరుకొంటూన్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వెలు గుడ్ న్యూస్ ను చెప్పింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు రూట్లలో 97 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది.కాకినాడ-లింగంపల్లి-కాకినాడ మధ్య జూలై 1 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు(80) నడవనుండగా.. హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య జూలై 1 నుంచి ఆగష్టు 28 వరకు స్పెషల్ ట్రైన్స్(17) నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఈ ట్రైన్స్ పూర్తీ వివరాలు.

07295(కాకినాడ టౌన్ – లింగంపల్లి) – ఈ రైలు వారంలో మూడు రోజులు(సోమవారం, బుధవారం, శుక్రవారం) నడవనుంది. ఆయా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ట్రైన్.. మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు లింగంపల్లి చేరుతుంది.

కాకినాడ-లింగంపల్లి-కాకినాడ(07295/07296): సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయి.

07296(లింగంపల్లి – కాకినాడ టౌన్) – ఈ రైలు ప్రతీ మంగళవారం, గురవారం, శనివారం పట్టాలెక్కనుంది. ఆయా రోజుల్లో రాత్రి 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుంది.ఈ రైలు వచ్చే నెల ఒకటి నుంచో మూడు నెలలు తిరగనుంది.

హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్(07115/07116): ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇతర్సి, భోపాల్, ఉజ్జయిన్, రట్లాం, మంద్సూర్, నిమచ్, చిత్తూర్‌గర్హ, భిల్వారా, బిజైనగర్, అజ్మీర్, ఫులేరా స్టేషన్స్‌లో ఆగుతుంది..
ఇంకా పలు ట్రైన్స్ ఉన్నాయి.. ఇవన్నీ కూడా హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు చేరుతాయి..ఈ ట్రైన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: