స్కూల్ వెళ్ళమంటున్న స్టూడెంట్స్.. టీసీ ఇవ్వమంటున్న పేరెంట్స్?

praveen
సాధారణంగా విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్ కు వెళ్లి చక్కగా చదువుకోవాలి అని భావిస్తూ ఉంటారు. ఒకవేళ విద్యార్థులు స్కూల్కు వెళ్లకపోతే తల్లిదండ్రులు మందలించి మరి స్కూల్ కి పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ గా జరుగుతుంది. మేము స్కూలుకి వెళ్ళబోము అంటూ విద్యార్థులు చెబుతూ ఉంటే మా పిల్లల టీసీలు ఇచ్చేయాలి అంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అటు ప్రభుత్వ పాఠశాలకు అరకొర వసతులు ఉండడమే అన్నది తెలుస్తుంది. పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేని పరిస్థితి ఉంది. దీంతో ఎన్నో రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడుతూ విద్యార్థులు స్కూలుకు వెళ్లేవారు.

 కానీ ఇప్పుడు మాత్రం తమ వల్ల కాదు అంటూ స్కూలుకి వెళ్ళము అంటూ తెగేసి చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలని కష్ట  పెట్టడం ఇష్టంలేక టీసీలు ఇచ్చేవరకు ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ నిరసన చేపట్టారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దామరగిద్ద మండలం ఉల్లి గుండం గ్రామ  విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విఠలాపూర్ లోని ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే దారి లేకపోవడంతో ప్రతిరోజు పొలాల గుండా వెళ్ళడం రావడం చేసేవారు. అయితే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయిన అలసత్వం జరుగుతూ వస్తోంది.

 ఈ క్రమంలోనే పొలాల గుండా వెళ్తూ వస్తూ ఉండటంతో కొంత మంది విద్యార్థులు ప్రమాదానికి కూడా గురవుతున్నారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన అవి పూర్తి కాలేదు.  దీంతో ఇక రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి తమకు సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేపట్టడం గమనార్హం. తమ పిల్లలతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దారిలేని బడికి రాలేమని టీసీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధానోపాధ్యాయుడు రెండు రోజుల సమయం ఇవ్వాలి ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే రెండు రోజుల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరోసారి ధర్నాకు దిగారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాన ఉపాధ్యాయుడు కూడా టీసీ ఇచ్చేందుకు సిద్ధపడు గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: