ఏపీలో వర్షాలే వర్షాలు.. ఐదు జిల్లాల్లో అత్యథికం..

Deekshitha Reddy
ఏపీలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన తొలి వారంలోనే మంచి వర్షాలు పడ్డాయి. రాయలసీమలోని ఐదు జిల్లాల్లో నైరుతు రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. మొత్తం ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వైఎస్సార్‌ జిల్లాలో గతేడాది సాధారణ వర్షపాతం కంటే ఈసారి 108.7 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. వారం రోజుల్లో 56.8 మిల్లీ మీటర్లు సాధారణ వర్షపాతం కాగా.. అత్యథికంగా 117.3 మిల్లీ మీటర్ల వర్షపాతం వైఎస్సార్ జిల్లాలో నమోదైంది. ఇక సత్యసాయి జిల్లాలో 52.8 మిల్లీ మీటర్ల వర్షం సాధారణం కాగా.. అక్కడ కూడా 94.9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 102.9 మి.మీ. వర్షం కురిసింది.
అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. 9 జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షాలు కురిశాయి. తిరుపతి, నంద్యాల, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, జిల్లాల్లో సాధారణ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మాత్రం వర్షపాతం అనుకున్న స్థాయిలో పడలేదు. అక్కడ వర్షపాతంలో భారీ లోటు కనిపిస్తోంది. వారం రోజుల్లో ఆయా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 65.3 శాతం తక్కువ, ఎన్టీఆర్ జిల్లాలో 70.5 శాతం తక్కువ వర్షపాతం పడింది.
జులై, ఆగస్ట్ లో మంచి వర్షాలు..
నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన వారం రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో వర్షాలు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాలు మినహా మిగతా చోట్ల అంతా పరిస్థితి సంతోషంగా ఉందని చెబుతున్నారు. సహజంగా నైరుతి రుతు పవనాలు మొదలయ్యే సీజన్‌ లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు, రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా.. రాయలసీమలో విస్తారంగా కురవడం విశేషం. ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలు తగ్గడం కాస్త నిరాశ కలిగించే అంశం.అయితే రాబోయే పది రోజుల్లో ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు అధికారులు. జులై, ఆగస్ట్ నెలల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: