అమరావతి : కాళ్ళబేరానికి రప్పించుకునే వ్యూహమేనా ?

Vijaya


పర్చూరు బహిరంగసభలో జనసేన అధినేత మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జరిగిన డ్యామేజిని కంట్రోల్ చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. చంద్రబాబునాయుడు వన్ సైడ్ లవ్ ప్రపోజల్ ను నమ్మి స్పందించిన పాపానికి జనసేనకు చాలా డ్యామేజీ జరిగింది. కుప్పంలో చంద్రబాబు పంపిన లవ్ ప్రపోజల్ కు రాజధాని ప్రాంతంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనిచ్చేదిలేదంటు భీకరమైన ప్రతిజ్ఞ చేశారు.



అంటే చంద్రబాబు డైరెక్టుగా చేసిన లవ్ ప్రపోజల్ కు పవన్ పరోక్షంగా స్పందించారు. ఎందుకంటే మిత్రపక్షం బీజేపీ ఉందికాబట్టి డైరెక్టుగా స్పందించలేకపోయారు. అయితే చంద్రబాబు లవ్ ప్రపోజల్ కు పవన్ పరోక్ష సంకేతాలకు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ లో టీడీపీకి రాష్ట్రంలో మళ్ళీ ఊపువస్తోందని చంద్రబాబుకు అనిపించింది. ఇదే సమయంలో  బాదాడుబాదుడు కార్యక్రమం, మహానాడు సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో ఎవరితోను పొత్తులు అవసరంలేదని చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళలో కూడా అనిపించింది.



దాంతో తమ్ముళ్ళందరు పవన్ను చాలా లైటుగా తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే అని పవన్ హఠాత్తుగా మూడు ఆప్షన్లు ప్రకటించారు. దాంతో ఇటు బీజేపీ అటు టీడీపీ పవన్ దుమ్ముదులిపేశాయి. దాంతో పవన్ కు బాగా డ్యామేజి జరిగిపోయింది. రెండుపార్టీల నేతలు కూడా పవన్ తన స్ధాయేంటో తెలుసుకుని మాట్లాడాలన్నట్లుగా రెచ్చిపోయారు. దాంతో అహందెబ్బతిన్న పవన్ తాజాగా ఎవరితోను పొత్తులేదు, గిత్తూలేదు పొమ్మన్నారు.



తాను నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటానని ప్రకటించారు. నిజానికి ఒంటరిగా పోటీచేస్తే పవన్ కు పోయేదేమీలేదు. ఏదైనా నష్టం జరిగితే చంద్రబాబుకే. ఇదే సమయంలో పెట్టుకున్నదే గోచీ కాబట్టి బీజేపీకి కొత్తగా పోయేది కూడా ఏమీలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబును కాళ్ళబేరానికి రప్పించుకునేందుకే ఎవరితోను పొత్తులేదని ప్రకటించింది. మరి ఇదే పాలసీపై పవన్ నిలబడితే బీజేపీ సంగతిని పక్కనపెట్టేసినా ఎన్నికల సమయానికి కచ్చితంగా చంద్రబాబు కాళ్ళబేరానికి రావటం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: