రెడ్ సిగ్నల్ జంపింగ్ వల్లే అంతా.. నివేదికలో షాకింగ్ నిజాలు?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. కనిపించని ప్రాణాంతకమైన మహమ్మారి దాడి చేసి ఎప్పుడు ప్రాణాలు తీస్తుందో అని అందరూ భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను తమ చేతులతోనే తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలీ. ఇటీవలి కాలంలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోతూ చివరికి కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నారు. అయితే రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రాణాలను రక్షించుకోవాలని అటు ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన చర్యలు చేపట్టిన ఎవరిలో మార్పు మాత్రం కనిపించడం లేదు.

 ఉరుకుల పరుగుల జీవితంలో ప్రాణాలకు కూడా విలువ ఇవ్వని వాళ్లు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వెరసి రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాలు సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఒకవైపు రోడ్డు నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించిన వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలి కాలంలో ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా ప్రమాదాలు జరిగి ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయంపై సర్వే నిర్వహించగా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

 ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్ల 2019లో 276 మంది మరణించగా 2020లో 79 శాతం పెరిగి 478 మంది మృతి చెందారని నివేదికలో వెల్లడయ్యింది. రాంగ్ రూటు డ్రైవింగ్ కారణంగా 3099 మంది,  మద్యం మత్తులో 1862 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020లో దేశవ్యాప్తంగా మూడు లక్షల 66 వేల 138  రోడ్డు ప్రమాదాల్లో.. ఒక లక్ష 31 వేల 714 మంది మరణించినట్లు నివేదిక చెబుతోంది. మూడు లక్షల 43 వేల 789 మంది క్షతగాత్రులు గా మిగిలారు. 2019 తో పోలిస్తే అటు ప్రమాదాల సంఖ్య 18 శాతం మరణాల రేటు 12 శాతం తగ్గింది అని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: