హైదరాబాద్ : రేవంత్ దుమ్ము దులిపేసిన యాష్కీ

Vijaya



కాంగ్రెస్ పార్టీ అంటేనే నూరుశాతం స్వేచ్చున్న పార్టీ. ఏ స్ధాయిలో నేతైనా ఎవరినైనా ఏమైనా అనచ్చు. అలాంటి నేతలపై మామూలుగా అయితే ఎలాంటి యాక్షన్ ఉండదు. ఒకవేళ సదరునేతను పార్టీ సస్పెండ్ చేసినట్లు ప్రకటించినా ఆ నేత పార్టీ సమావేశాల్లో పాల్గొన్నపుడు ఎవరు ఏమీ మాట్లాడరు. ఇపుడీ విషయం ఎందుకంటే తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్యపై మాజీ ఎంపీ మధుయాష్కీ దుమ్ముదులిపేయటం సంచలనంగా మారింది.



కాంగ్రెస్ అంటేనే నిత్యం గొడవలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆధిపత్య గొడవలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు, బహిరంగలేఖలన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. రేవంత్ మాట్లాడుతు రెడ్లకు పగ్గాలిస్తేనే అన్నీ పార్టీలకు మనుగడ అని అన్నారు. మరామాట రేవంత్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో లేదో అర్ధం కావటంలేదు. రేవంత్ మాటలపై మిగిలిన పార్టీ సంగతి ఎలాగున్నా సొంతపార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది.



రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీఎంపీ యాష్కీ పెద్ద బహిరంగ లేఖే రాశారు. ఆ లేఖలు రేవంత్ ను పట్టుకుని దుమ్ముదులిపేశారు. ఒకరకంగా రేవంత్ కు చాకిరేవు పెట్టారనే అనుకోవాలి. రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీ మూలసూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ ఇలా సకల కులాలు, వర్గాలు, మతాల కలయికగా గుర్తుచేశారు. వైఎస్సార్ వల్లే యూపీఏ ఏర్పడింది, వైఎస్ పోగానే యూపీఏ పోయిందనే వ్యాఖ్యలు సోనియా, రాహుల్ ను అవమనించినట్లుగానే ఉందని ఆక్షేపించారు.



రెడ్డి సామాజికవర్గంతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడుతుందంటే ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. డీకే అరుణారెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరే ఎంఎల్ఏలుగా ఎందుకు ఓడిపోయారంటు రేవంత్ ను గట్టిగా అంటుకున్నారు. రెడ్డి అభ్యర్ధులు ఎవరెవరు, ఏఏ ఎన్నికల్లో చెబుతు ఎందుకు ఓడిపోయారో చెప్పాలంటూ నిలదీశారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల పార్టీలోని మిగిలిన సామాజికవర్గాల్లో గందరగోళం మొదలైందని గుర్తుచేశారు. మొత్తానికి యాష్కీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ పైనే పడింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: