అప్పుడు గోధుమలు..ఇప్పుడు చక్కెర..ఎగుమతుల పై నిషేధం..

Satvika
మొన్నీమధ్య గొధుమల ఎగుమతులను ప్రభుత్వం నిలుపి వేసిన సంగతి తెలిసిందే.. మన దేశంలో గోధుమల కొరత ఎక్కువగా ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పుడు చక్కెర ఎగుమతులను కూడా కేంద్రం నిలిపి వేసిన విషయం తెలిసిందే. ద్రవోల్బణం పెరుగుతోన్న నేపథ్యంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యం లో ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించింది. ఇకపోతే విదేశాలకు ఎగుమతి చేయడంతోనే దేశీయంగా చక్కెర ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌తో ముగియనున్న ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో చక్కెర ఎగుమతుల ను కోటి టన్నుల వరకు మాత్రమే పరిమితం చేస్తామని కేంద్రం పేర్కొంది.. దేశంలో చక్కెర దేశీయ లభ్యత మరియు ధర స్థిరత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యం తో జూన్ 1 నుండి చక్కెర ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటన లో తెలిపింది. చక్కెర ఎగుమతి పై ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయని సమాచారం.అప్పటికి దేశంలో కొరత పెరిగితే మళ్ళీ పూర్తిగా నిషెదిస్తామని అధికారులు ఆలోచిస్తున్నారు.


చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ దేశాల్లో భారత్‌ రెండో అతిపెద్ద దేశంగా ఉంటోంది. బ్రెజిల్‌ మొదటి స్థానం లో కొనసాగుతున్నది. భారత్‌లో ఉత్పత్తి చేసే చక్కెర.. ఇండోనేషియా, మలేషియా, దుబాయ్‌, ఆఫ్గనిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంది. 2018-19లో 38 లక్షల టన్నుల చక్కెరను భారత్‌ విదేశాలకు ఎగుమతి చేసింది. కొన్ని రోజుల క్రితం గోధుమల ఎగుమతుల పై కళ్లెం వేయడంతో.. ప్రపంచ వ్యాప్తంగా ధరలు భారీగా పెరిగి పోయాయి. గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం విషయం లో భారత్‌ మళ్లి ఆలోచించాలని పలు దేశాలు కోరుతున్నాయి.. మరి ఈ విషయం పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తోసుకుంటుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: