అమరావతి : ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందేనా ?

Vijaya



దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సుకు జగన్మోహన్ రెడ్డి అలా బయలుదేరేరో లేదో తెలుగుదేశంపార్టీ, ఎల్లోమీడియా ఇలా కాంట్రవర్సీ మొదలుపెట్టేసింది. జగన్ ప్రతి అడుగును బాగా వివాదం చేయాలని టీడీపీ, ఎల్లోమీడియా టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే దావోస్ పర్యటనపై తీవ్రంగా బురదచల్లేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎల్లోమీడియా, టీడీపీ జగన్ను కొన్ని ప్రశ్నలు వేస్తున్నది. ఇపుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ పై పడింది.



టీడీపీ, ఎల్లోమీడియా ప్రశ్నలు వేస్తోందని కాదుకానీ జనాలకు క్లారిటి ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. వీళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఏమిటంటే జగన్ స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ కాకుండా లండన్ కు ఎందుకు వెళ్ళారు ? జ్యూరిక్ నుండి దావోస్ కు బై రోడ్డు వెళ్ళిపోవచ్చు. లండన్ వెళ్ళేందుకు జగన్ కు కోర్టు పర్మిషన్ ఉందా ? అసలు జగన్ వెళితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా ? కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని జగన్ ఎలా వృధాచేస్తారు ?



నిజానికి ప్రజాధనాన్ని వృధాచేయటంలో చంద్రబాబునాయుడు తర్వాతే ఎవరైనా. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు అధికారికంగా ఆహ్వానం అందితేనే జగన్ వెళ్ళింది. కానీ చంద్రబాబు హయాంలో చాలాసార్లు పీఆర్ ఏజెన్సీ ద్వారా ఆహ్వానాన్ని కోట్లాది రూపాయలకు కొనుక్కుని చంద్రబాబు, లోకేష్ వెళ్ళారనే ఆరోపణలున్నాయి. మరి దానికి టీడీపీ ఏమి సమాధానం చెబుతుంది ? ఇక లండన్ వెళ్ళటంపై టీడీపీకి ఏమిటి సంబంధం ? ఇందులో ఏదైనా అభ్యంతరం ఉంటే కోర్టు-జగన్ చూసుకుంటారు.




చివరగా పెట్టుబడుల విషయానికి వస్తే వరుసగా నాలుగు సంవత్సరాలు దావోస్ కు వెళ్ళిన చంద్రబాబు వల్ల, ఒకసారి వెళ్ళిన లోకేష్ వల్ల ఎన్ని పెట్టుబడులు వచ్చాయో టీడీపీ చెప్పగలదా ? ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించటానికి మాత్రమే తాము వెళుతున్నట్లు ముందే మంత్రులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. పెట్టుబడుల కోసం ఒక్కసారి జగన్ దావోస్ కు వెళితేనే టీడీపీ, ఎల్లోమీడియా సహించలేకపోతోంది. మరి పెట్టుబడుల పేరుతో చంద్రబాబు 17 దేశాల్లో తిరిగి ఉత్తచేతులతో వచ్చినపుడు ప్రజాధనం వృధా అవుతోందని తెలీలేదా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: