అమరావతి : మూడు వైపులా వాయించేస్తున్నారుగా ?

Vijayaభవిష్యత్తులో పొత్తుల సంగతేమిటో గానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబునాయుడుకు వైసీపీతో పాటు మిగిలిన రెండుపార్టీల వాయింపుడు పెరిగిపోతోంది. అధికార వైసీపీ మామూలుగానే చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటున్నారంటే అర్ధముంది. మరి ఇదే సమయంలో రెండువైపుల నుండి జనసేన నేతలు, బీజేపీ నేతలు కూడా చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు ?జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తొందరలోనే చంద్రబాబుకు పొత్తు కుదురుతుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్ ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని ఇద్దరు పిలుపిస్తున్నారు. అయితే వీళ్ళద్దరి మనసులో ఉన్నది మాత్రం తామిద్దరం ఏకంకావాలని మాత్రమే అని అర్ధమవుతోంది. అందుకనే చంద్రబాబు అయినా తమ్ముళ్ళయినా పవన్ను కానీ లేదా జనసేన పార్టీని గానీ పల్లెత్తుమాట  కూడా అనటంలేదు. జనసేన నేతలు చంద్రబాబును ఎంతగా ఎద్దేవా చేస్తున్నా తమ్ముళ్ళు మాత్రం అతికష్టంమీద కామ్ గా ఉంటున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ఎలాగైనా పొత్తుకుదుర్చుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తే కమలనాదులు అంతలా దూరం జరుగుతున్నారు. చంద్రబాబుతో పొత్తు విషయంలో  పార్టీ చీఫ్ సోమువీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణతో కొందరు నేతలు చంద్రబాబుపై రెచ్చిపోతున్నారు.డైరెక్టుగా చంద్రబాబుపై పవన్ ఏమీ మాట్లాడకపోయినా కొందరు నేతలు మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ట్విట్లర్లోను, మీడియా సమావేశాలు పెట్టి ఎందుకు రెచ్చిపోతున్నారన్నది తమ్ముళ్ళకు అర్ధం కావటంలేదు. అంటే ఇపుడు చంద్రబాబుపై మూడువైపుల నుండి దాడులు జరుగుతున్నాయి. అంటే పొత్తులపై ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా, త్యాగాలకు సిద్ధమని బంపరాఫర్ ఇస్తున్నా మరోవైపు దాడులు తప్పటంలేదు. ఈ విషయంలోనే ఏమి జరుగుతున్నదో  తమ్ముళ్ళకు అర్ధం కావటంలేదు. జగన్ తరపున ఆరోపణలు, విమర్శలంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ జనసేన వైపు నుండి కూడా ఆరోపణలు, విమర్శలు రావటం ఏమిటనేదే తమ్ముళ్ళను వేధిస్తోంది. మొత్తానికి చంద్రబాబుకు మూడువైపుల నుండి వాయింపులు తప్పటంలేదని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: