ఆ రాష్ట్ర ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పిన కేంద్రం... ?
ఉపాధి హామీ పథకం చట్టం కింద ప్రతి ఆర్ధిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ గత కొన్నేళ్లుగా గ్రామాల పరిధిలో వంద పని దినాలను కల్పిస్తూ వారికి కనీస వేతనం చెల్లిస్తూ సహాయ పడటం జరుగుతోంది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం మంగళవారం నాడు ముఖ్య ప్రకటన విడుదల చేసింది. పెరిగిన కూలీ రేట్ల వివరాలు చూడగా తెలంగాణలో రోజుకు ఒక కూలికి రూ. 257 వేతనాన్ని చెల్లించనున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ పని గంటల సమయం తక్కువ గానే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక పెంచిన రేట్లు వచ్చే నెల అనగా ఏప్రిల్ నుండి అమలు లోకి రానున్నట్లు పేర్కొంది ప్రభుత్వం.
ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలుస్తుండటం గర్వించదగ్గ విషయం. ఈ పథకంతో రాష్ట్రం లోని కూలీలకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో 3,803 కోట్ల రూపాయలను ప్రస్తుతం ఈ పథకానికి వెచ్చించారు. తద్వారా 29 లక్షల కుటుంబాలకు చెందిన 48 లక్షల మంది కూలీలకు పని కల్పించడం జరిగింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా గ్రామాలలో ఈ ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.