"ఐరాస"లో తన పవర్ చూపించిన రష్యా ?
ఈ యుద్దాన్ని ఐక్యరాజ్యసమితి ఖండిస్తున్నట్లుగా ఓటింగ్ పెట్టింది. అయితే ఇక్కడ భారత, యూఏఈ మరియు చైనా దేశాలు ఈ యుద్ధం పట్ల తటస్థమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. కాగా 11 దేశాలు మాత్రం రష్యా చేస్తుంది నియంతృత్వ చర్యే అని వ్యతిరేకంగా ఓటు వేశాయి. కానీ రష్యా మరోసారి తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి ఐక్యరాజ్యసమితి భద్రత మండలి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రద్దు అయ్యేలా చేసింది. దీనితో సభ్యదేశాలు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే భారత తరపున రాయబారిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితుల పట్ల ప్రపంచ దేశాలు చింతిస్తున్నాయని చెప్పారు.
వెంటనే భద్రత మండలిలో సభ్యులుగా ఉన్న అన్ని దేశాలు రష్యా మరియు ఉక్రెయిన్ ల మధ్యన ఉన్న అన్ని సమస్యలు, విభేదాలు మరియు వివాదాలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేయాలని విన్నవించారు. ఈ అకృత్యాల పట్ల భారత్ చాలా విచారంగా ఉందని తన ఆవేదనను తెలిపారు. హింస వలన జరిగేది ఈమె ఉండదని, మానవుల ప్రాణాలను తీయడం వలన సమస్య పరిష్కారం కాదని మండలిలో ఆయన మాట్లాడారు.