ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్... జగన్ ప్లాన్ ఏంటో?
జగన్ ప్రభుత్వం నిజాయితీ గల ప్రభుత్వ అధికారులను గౌరవించదు... తమ రాజకీయ స్వార్ధానికి వాడుకుని ఇప్పుడు విధుల నుండి తొలగించడం ఏమిటంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే మరో షాక్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు గౌతమ్ సవాంగ్ ను వేరే రాష్ట్రానికి వదిలీ చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ఈ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తతో ప్రతిపక్షాలకు భారీ షాక్ ఇచ్చినట్లయింది. అయితే ఒక పోలీస్ సర్వీస్ లో ఉండే వ్యక్తిని ఇలా ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేయడం వెనుక ఏమి ఆంతర్యం ఉందో ఎవరికీ అంతుబట్టడం లేదు.
అయితే డీజీపీ గా ఎందుకు తొలగించారు అన్న విషయం పై చాలా కారణాలు వినిపిస్తున్నా దీనిపై అటు ప్రభుత్వం కానీ ఇటు గౌతమ్ సవాంగ్ కానీ ఎటువంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. గౌతమ్ సవాంగ్ కెరీర్ లో ఇప్పటి వరకు తాను చేపట్టిన బాధ్యతలు అన్నింటిలోనూ మంచి రికార్డు ఉంది. అయితే ఏపీపీఎస్సీ లో ఏ విధంగా తన కార్యచరణతో ముఞ్చదుకు వెళతాడు అన్నది చూడాలి. అయితే ఈ విషయంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ మనసులో ఏముంది? బదిలీ అన్నాడు మళ్ళీ ఏపీలోనే పోస్టింగ్ ఇచ్చాడు అంటూ తలలు పట్టుకుంటున్నారు.