టీడీపీ కోటపై పవన్ గురి..?

M N Amaleswara rao
రాజకీయంగా బలపడటానికి జనసేన సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే...ఇప్పటికే పవన్ కల్యాణ్...మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలపడటమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు...అదే సమయంలో గత ఎన్నికల్లో కాస్త ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు...అలాగే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం గెలిచిన సీట్లపై పవన్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికిప్పుడు జనసేన 175 నియోజకవర్గాల్లో బలపడలేదు..అసలు ఆ పార్టీకి 50 నియోజకవర్గాల్లో కూడా సరైన బలం లేదు. అందుకే 175 కంటే ముందు తమకు బలం ఉన్న నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు...అలాంటి నియోజకవర్గాల్లోనే జనసేన తరుపున బలమైన నాయకులని పెడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్, టీడీపీ కంచుకోటగా ఉన్న పెద్దాపురం స్థానంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
మొదట నుంచి పెద్దాపురం టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం...1983, 1985, 1994, 1999, 2014, 2019 ఎన్నికల్లో పెద్దాపురంలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో నిమ్మకాయల చినరాజప్ప వరుసగా గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే పెద్దాపురంలో రాజప్పకు కాస్త బలం ఎక్కువే. అదే సమయంలో ఇక్కడ వైసీపీ తరుపున దవులూరి దొరబాబు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు.

 
కాకపోతే కాపు సామాజికవర్గం ప్రభావం ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేనకు బలం ఉంది. అసలు 2009 ఎన్నికల్లో ఈ సీటుని ప్రజారాజ్యం గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 25 వేల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆ ఓట్లని మరింత పెంచడమే లక్ష్యంగా జనసేన నేతలు పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో కాపులని పూర్తిగా తమ వైపుకు తిప్పుకుంటే జనసేనకు తిరుగుండదు. పెద్దాపురం జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కానీ బలంగా ఉన్న రాజప్పకు చెక్ పెట్టడం ఈజీ కాదనే చెప్పాలి. ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన పెద్దాపురం సీటు టీడీపీకే దక్కుతుంది. మరి చూడాలి పెద్దాపురంలో జనసేన ఏ మేర రాణిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: