అమరావతి : ఒకేరోజు రెండు షాకులు తగిలాయా ?

Vijaya


ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఒకేరోజు రెండు షాకులు తగిలాయి. ఆ షాకులు కూడా ఎంత గట్టిగా తగిలాయంటే అసలు నోరెత్తలేకపోయేంతగా. ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి షాకేమో రెండుగా విడిపోతున్న కృష్ణాజిల్లాలో ఒకదానికి ఎన్టీయార్ పేరు పెట్టడం. ఇక రెండో షాకేమో తమ ఎంఎల్సీ పరుచూరి అశోక్ బాబుపై ఏపీసీఐడీ కేసులు నమోదుచేయటం. మామూలుగా అయితే టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టగానే యావత్ తమ్ముళ్ళంతా మూకుమ్మడిగా రెచ్చిపోతుంటారు.



అయితే ఇక్కడ అశోక్ మీద కేసంటే తమ్ముళ్ళల్లో కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నోరెత్తటంలేదు. చంద్రబాబు, లోకేష్ అయితే తమకు అసలా విషయమే తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్వీసు రికార్డును ట్యాంపరింగ్ చేశాడనే ఆరోపణలు టీడీపీ అధికారంలో ఉన్నపుడే వచ్చింది. అప్పట్లోనే విచారణ కూడా జరిగింది. కానీ తెరవెనుక ఏమైందో ఏమో కేసు మూతపడిపోయింది. వెంటనే అశోక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ వెంటనే టీడీపీ తరపున ఎంఎల్సీ కూడా అయిపోయారు.



అంటే లోకాయుక్త ఆదేశాల కారణంగా ఇపుడు అశోక్ బాబు మీద నమోదైన కేసులో ఎంఎల్సీ పూర్తిగా ఇరుక్కున్నట్లే ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే అశోక్ మీద ఆరోపణలు నిర్ధారణైందట. కానీ అప్పట్లో తనకు అశోక్ మద్దతుగా ఉన్న కారణంగా చంద్రబాబు కేసును క్లోజ్ చేయించారు. కానీ ఇంతకాలానికి మళ్ళీ అదే కేసు తిరిగి లేచికూర్చుంది.  అశోక్ మబీద నమోదైన కేసుపై చంద్రబాబు అండ్ కో కనీసం నోరెత్తలేకపోతున్నారంటేనే అందరికీ విషయం అర్ధమైపోతొంది. మరో కేసు ఏమిటంటే కర్నాటక ఎన్నికల్లో కొందరిని వెంటేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం కూడా నిరూపణయ్యిందట. సర్వీసు రూల్సుకు విరుద్ధంగా వ్యవహరించి ఆధారాలతో సహా దొరికిపోయారు కాబట్టే అశోక్ గట్టిగా తగులుకున్నారు.



ఇక ఎన్టీయార్ జిల్లా విషయంలో కూడా ఏమని స్పందించాలో చంద్రబాబు అండ్ కో అర్ధం కావటంలేదు. నిజానికి అల్లుడి హోదాలో చంద్రబాబు చేయాల్సిన పనిని ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డి చేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడబోతున్న కొత్తజిల్లాకు ఎన్టీయార్ విజయవాడ జిల్లాగా పేరు పెట్టడాన్ని చంద్రబాబు అండ్ కో స్వాగతించలేక, వ్యతిరేకించలేక నానా అవస్తలు పడుతున్నారు. స్వాగతిస్తే మొత్తం క్రెడిటంతా జగన్ కు వెళిపోతుంది. పోనీ వ్యతిరేకిద్దామా అంటే మొదటికే మోసమొస్తుంది. అందుకనే పై రెండు విషయాల్లో చంద్రబాబు పరిస్ధితి కక్కలేక మింగలేక అన్నట్లుగా అయిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: