ఒమిక్రాన్: ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు...

VAMSI
దేశం రోజు రోజుకీ ప్రమాదంలో కూరుకుపోతోంది. ఆ ప్రమాదం పేరే ఒమిక్రాన్ అంటూ తోకను తగిలించుకున్న కరోనా వైరస్. గతంలో ఇదే విధంగా మానవజాతిని బెంబేలెత్తించిన కరోనా ఈ సారి కూడా అంతకు మించిన భయాన్ని కలిగిస్తోంది. దేశంలోని ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఈ సారి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సోకుతున్న వైరస్ చాలా వేగంగా ఉంది. గంటల వ్యవధిలో దేశంలోని కేసుల సంఖ్య లక్షల్లోకి మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూడా మెల్ల మెల్లగా కేసులను పెంచుకుంటూ ఇతర రాష్ట్రాల కన్నా మేము తగ్గేదేలే అంటూ పరుగెడుతోంది.
ఇప్పుడు తాజాగా కాసేపటి క్రితం వచ్చిన న్యూస్ ఒకటి ఒక జిల్లా ప్రజలను ఆందోళన రేకెత్తిస్తోంది. కోస్తాఆంధ్ర లోని నెల్లూరు జిల్లాలో కేవలం ఒక్క రోజులో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. ఈ కేసులతో కలిపి ఇప్పుడు మొత్తం 1,52,423 కేసులు అయ్యాయి. ఈ వార్త అందరికీ తెలియడంతో మరింత కంగారు పడుతున్నారు. నెల్లూరు జిల్లా అధికార యంత్రంగం త్వరిత గతిన నివారణ చర్యలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ పెట్టకుండా పొరపాటు చేస్తున్నట్లుగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసుల సంఖ్య ఇలాగే కొనసాగితే నెల్లూరు జిల్లా ప్రమాదంలో పడినట్లే. దీనికి ముందు ముందు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోకుండా మనకు చేతనైనంత వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ ను మనకు దూరంగా ఉంచడం మంచిదని డాక్టర్లు, వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. వీలైనంత వరకు అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి. ఒకవేళ బయటకు వెళితే మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మరిచిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: