ప్రకాశం పాలిటిక్స్: వైసీపీలో అదిరిపోయే ట్విస్ట్?

M N Amaleswara rao
గెలుపే లక్ష్యంగా ఎప్పటికప్పుడు వైసీపీలో అనేక కీలక మార్పులు జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొదట నుంచి జగన్..పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే ఆయన ఎప్పుడు ఒకేబాటలో రాజకీయం చేయరు. ఇప్పటివరకు అనేకవిధాలుగా మార్పులు చేసుకుంటూ వచ్చిన జగన్...రానున్న ఎన్నికల్లో కూడా మార్పులు చేయడం ఖాయమని తెలుస్తోంది. అసలు 2014, 2019 ఎన్నికలకు వైసీపీలో అనేక తేడాలు వచ్చిన విషయం తెలిసిందే. 2014లో చేసిన ప్రయోగాలు వల్ల వైసీపీకి నష్టం జరిగింది. అందుకే మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జగన్ రూట్ మార్చేసి, 2019లో సక్సెస్ అయ్యారు.
అదే సమయంలో 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరికి 2019 ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదు. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకోవడంతో జగన్ రూట్ మార్చేసి...వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశాలు ఇచ్చారు. దీంతో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలంటే వైసీపీలో కొన్ని మార్పులు జరిగేలా ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికి మళ్ళీ సీట్లు దక్కడం అనేది కష్టమే.

 
ఈ క్రమంలోనే పలు సీట్లలో మార్పులు చేయడం ఖాయమని తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేల సీట్లు చిరగనున్నాయని అర్ధమవుతుంది. ఇప్పుడు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాంటివారికి నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం కష్టమని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అదిరిపోయే ట్విస్ట్‌లు ఉండేలా ఉన్నాయి. ఇక్కడ కనీసం మూడు, నాలుగు సిట్టింగ్ సీట్లలో మార్పులు జరగొచ్చని తెలుస్తోంది.
అదే సమయంలో వైవీ సుబ్బారెడ్డిని మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ బరిలో దించి, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం బరిలో దించుతారని తెలుస్తోంది. అలాగే దర్శి, కనిగిరి, గిద్దలూరు, సంతనూతలపాడు స్థానాల్లో సీట్లు మారే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం, చూడాలి ప్రకాశం వైసీపీలో ఎన్ని మార్పులు జరుగుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: